Koratala Siva: దర్శకుడు కొరటాల శివ మౌనవ్రతం పాటిస్తున్నారు. అది కూడా కేవలం మీడియా ముందే. ఆచార్య సినిమా ప్లాప్ తర్వాత.. పూర్తిగా నిరుత్సాహానికి గురి అయ్యాడు కొరటాల. అయితే.. ఆ నిరుత్సాహం కంటే కూడా.. ‘కొరటాల’ను ఎక్కువగా బాధ పెట్టింది మాత్రం మీడియానే. బయ్యర్లు తన అఫీస్ పై ఎటాక్ చేశారని మీడియా పుకార్లు పుట్టించి.. తన పరువు తీసింది అని కొరటాల శివ ఫీల్ అవుతున్నాడు.
అందుకే, ఎన్టీఆర్ తో తాను చేసే సినిమా విడుదల అయ్యేవరకూ ఇక మీడియాతో మాట్లాడకూడదని కొరటాల నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత, కొరటాల మీడియా కోసం ప్రెస్ మీట్ పెడతాడట. అప్పుడే తన పై వచ్చిన రూమర్స్ కి జవాబు చెబుతా అంటున్నాడు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడడం అన్నది డైరక్టర్లకు అలవాటు.
Also Read: Liger Trailer: లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బీడ్ ‘లైగర్’.. ‘దేవరకొండ’ యాక్షన్ విశ్వరూపం
అదే, సినిమా గనుక ప్లాప్ అయితే, ఇక ఆ తర్వాత కొంత మంది డైరెక్టర్లు మీడియా ముందుకు రారు. ఐతే, కొరటాల ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆచార్య ప్లాప్ కాదు, ఆచార్య నష్టపరిహారం విషయం కావచ్చు. రిలీజ్ కి ముందు ఆచార్య సినిమా గురించి కొరటాల మామూలుగా కబుర్లు చెప్పలేదు. కానీ, ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పల్టీ కొట్టింది.
దాంతో నెటిజన్లు, కొరటాల, ఆచార్య సినిమా ముందు చెప్పిన కబుర్లను పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేసారు. బహుశా అందుకే ఇప్పట్లో మీడియాతో మట్లాడాలని లేదు అంటూ కొరటాల దూర దూరంగా ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమా మీద కొరటాల చాలా నమ్మకంతో ఉన్నాడు.
పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత, ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కొరటాల దే. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. కాబట్టి, కొరటాల తన మౌనాన్ని ఎన్టీఆర్ సినిమా విడుదల మధ్యాహ్నం బద్దలు కొడతాడట. ఎంతైనా సినిమా హిట్ టాక్ తరువాత వచ్చే జోష్ వేరు. మాటలు వేరు కదా.
Also Read:Dil Raju- Karthikeya 2: ఆ సీక్వెల్ కి అన్యాయం చేసిన దిల్ రాజు.. ఇది బాధాకరం