Jr NTR, Koratala Siva: ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించి రేపటి నుండి స్టోరీ సీట్ట్టింగ్స్ సిటింగ్స్ జరగబోతున్నాయి. ఈ సిటింగ్స్ లో రచయితలు శ్రీధర్ సీపాన, మచ్చ రవితో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ కూడా కూర్చోబోతున్నారు. ఈ సినిమా కథ ఫైనల్ అయ్యాక, మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతాయట. ఈ సినిమాకు ‘అనిరుధ్ రవిచందరన్’ మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఎన్టీఆర్ తో ‘అనిరుధ్ రవిచందరన్’ ఎప్పుడో ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఫిక్స్ అయిన కాంబినేషన్ ఇది. పైగా అనిరుధ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గత రెండు సినిమాలుగా ఎదురుచూశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కలయిక కుదరలేదు. అయితే, ఎన్టీఆర్ చొరవతో ఇప్పుడు ఈ కలయిక కుదిరింది. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు అనిరుధ్ సంగీతం ఇస్తున్నాడు.
Also Read: బాలయ్యతో చేయడం అంటే ఆ ముద్ర వేయించుకోవడమే
అయితే, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పాటలు బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేసే సినిమా సాంగ్స్ అంతకు మించి ఉండాలనేది కొరటాల ఆలోచన. ఈ మధ్య దేవి నుండి బెస్ట్ సాంగ్స్ రావడం లేదు. అందుకే, దేవి ప్లేస్ లో అనిరుధ్ ను తీసుకున్నారు. నిజానికి కొరటాల తన మొదటి నాలుగు సినిమాలకు, దేవిశ్రీ ప్రసాద్ తో సంగీతం చేయించాడు.
కానీ ఏమైందో ఏమో గానీ, దేవితో బంధం కట్ అయింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మతో సంగీతం చేయిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడట. విలన్ కి రైట్ హ్యాండ్ లా కమెడియన్ సునీల్ ఓ ప్రత్యేక విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read: ప్చ్.. మహేష్ సినిమాలో కూడా అదే ఫైట్ !
అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. ఇక ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.