https://oktelugu.com/

Sarkaru Vaari Paata: రంగం లోకి దిగిన కొరటాల శివ.. సర్కారు వారి పాట లో భారీ మార్పులు

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా కేవలం ఒక్క పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..గీత గోవిందం వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2022 / 05:14 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా కేవలం ఒక్క పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..గీత గోవిందం వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు..ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో దూకుడు వంటి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అని, అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవుతుంది అని అభిమానులు గట్టి నమ్మకం తో ఉన్నారు..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయినా రెండు పాటలకు మరియు టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..త్వరలోనే మాస్ కి పిచ్చెక్కించే ఒక్క సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నారు అట మూవీ టీం..ఈ పాట మహేష్ కెరీర్ లో చార్ట్ బస్టర్ హిట్స్ లో ఒక్కటిగా నిలిచిపొయ్యే విధంగా ఉంటుంది అట..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వార్త ఒక్కటి సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తోంది.

    Sarkaru Vaari Paata

    ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా రషెస్ ని ఇటీవలే మహేష్ బాబు చూశాడట..ఎందుకో ఆయనకీ కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచలేదు అట..దానితో ఆయనకీ అత్యంత సన్నిహితుడు అయినా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ని పిలిపించి సినిమాని చూపించాడట మహేష్..ఈ సినిమాని చూసిన కొరటాల శివ ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల కి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చెప్పాడట..ప్రస్తుతం మూవీ టీం మొత్తం కొరటాల శివ చెప్పిన ఆ మార్పులకు అనుగుణంగా సినిమా ని ఎడిటింగ్ చేస్తున్నారు అట,ఈ సినిమా లో మహేష్ బాబు ఒక్క బ్యాంకింగ్ కంపెనీ కి సంబంధించిన ఏజెంట్ గా కనిపించబోతున్నారు అట..ఈ సినిమా లో మొండి బకాయిలను వసూలు చెయ్యడం మహేష్ బాబు డ్యూటీ..ప్రముఖ బ్యాంకింగ్ కంపెనీలు చేసే దోపిడీలను ప్రాజెక్ట్ చేస్తూ ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ + సందేశం ఉండేట్టు అద్భుతంగా తెరకెక్కించాడు అట డైరెక్టర్ పరశురామ్ పెట్ల..మహేష్ బాబు ఫాన్స్ కి ఈ సినిమా పోకిరి స్థాయిలో మాస్ ఫీస్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం, విడుదలకి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేకపోవడం తో ఈ సినిమా ఎలా ఉంటబోతుందో అని మహేష్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read: రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా థియేటర్!

    సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ బాబు దాదాపుగా రెండేళ్లు వెండితెర పై కనిపించలేదు..దీనితో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆకలి తో ఎదురు చూస్తున్నారు..వారి ఎదురు చూపులకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకే మహేష్ బాబు ఎంతో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది..ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది..ఖలేజా తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడం తో మహేష్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమా పూర్తి అయినా వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా ప్రారంభిస్తాడు మహేష్.

    Also Read: RRR లో తారక్ పాత్రని అందుకే తగ్గించాము

    Tags