https://oktelugu.com/

KGF 2 Effect on RRR Collections: RRR కలెక్షన్స్ పై KGF చాప్టర్ 2 ఎఫెక్ట్.. ఆ ఒక్క ప్రాంతం నుండి భారీ నష్టాలు

KGF 2 Effect on RRR Collections: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన KGF చాప్టర్ 2 భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా నిన్న అన్ని బాషలలో ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2022 / 05:19 PM IST
    Follow us on

    KGF 2 Effect on RRR Collections: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన KGF చాప్టర్ 2 భారీ అంచనాల నడుమ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా నిన్న అన్ని బాషలలో ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది…అందరి అంచనాలను ఈ సినిమా దాటివేస్తూ మొదటి రోజు కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 137 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..#RRR తర్వాత అంతతి భారీ స్థాయి వసూళ్లను మొదటి రోజు రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమా ఇదే..ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది..మొదటి రోజు ఇక్కడి నుండి ఈ సినిమా దాదాపుగా 25 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూలు చేసింది ..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి మొదటి రోజు దాదాపుగా 160 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అని అంచనా..అయితే KGF చాప్టర్ 2 వసూళ్లు నిన్న మొన్నటి వరుకు బాక్స్ ఆఫీస్ వద్ద డ్రీం రన్ చేస్తున్న #RRR పై గట్టి ప్రభావం చూపించింది అని ట్రేడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.

    KGF 2 Effect on RRR Collections

    ముఖ్యంగా బాలీవుడ్ లో KGF చాప్టర్ 2 ప్రభావం #RRR పై చాలా తీవ్రంగా పడింది అనే చెప్పాలి..ఎందుకంటే ఏప్రిల్ 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరుకు వరుసగా హాలిడేస్ రావడం..ఈ హాలిడేస్ లో వచ్చే అద్భుతమైన కలెక్షన్స్ అన్ని ప్రధానంగా KGF కి వెళ్లిపోవడం #RRR పై పెద్ద ప్రభావం చూపించింది అనే చెప్పాలి..ఈ హాలిడేస్ లో ఒక్కవేల KGF 2 లేకపోయి ఉంటె ఈ నాలుగు రోజుల్లో #RRR కి దాదాపుగా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చేవి అట..కానీ KGF 2 బాక్స్ ఆఫీస్ ప్రభంజనం వల్ల #RRR మూవీ కి ఈ నాలుగు రోజులకు కలిపి కనీసం 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు అని తెలుస్తుంది..ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ ,కోలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో కూడా KGF ప్రభావం #RRR మూవీ పై గట్టిగా పడింది అనే చెప్పాలి..ఇక వీకెండ్ తర్వాత #RRR బాక్స్ ఆఫీస్ రన్ ఇక ముగిసిపోయినట్టే అని కూడా తెలుస్తుంది..ఇప్పటికే #RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

    Also Read: NTR Role in RRR: RRR లో తారక్ పాత్రని అందుకే తగ్గించాము

    KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్ లో #RRR కలెక్షన్స్ ని దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా మొదటి రోజు 53 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసింది..రెండవ రోజు కూడా అద్భుతమైన వసూలు రాబట్టిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే #RRR ఫుల్ రన్ ని హిందీ లో దాటేస్తుంది అని అర్థం అవుతుంది..#RRR ఇప్పటి వరుకు బాలీవుడ్ లో 250 కోట్ల రూపాయిలు వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వసూళ్లను KGF చాప్టర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే దాటేస్తుంది అని అంచనా..అన్ని బాషల కంటే ఈ సినిమా హిందీ లోనే ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ఇదే ఊపుని కొనసాగిస్తే కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..మరి భవిష్యత్తులో ఈ సినిమా ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.

    Also Read: Prashanth Neel KGF 2: ఏది పెద్ద హిట్.. ఎవ‌రు గొప్ప డైరెక్టర్.. త్రిబుల్ ఆర్ తో కేజీఎఫ్-2 ను పోలుస్తున్న ఫ్యాన్స్..

    Tags