Koratala Shiva: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను ఫైనల్ చేసుకున్నారు. కానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. గత వారం రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకుందని టాక్ నడిచింది.

మొత్తానికి ఎన్టీఆర్ కి అలియా షాక్ ఇచ్చిందని.. అందుకే, ఆలియా భట్ ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని పుకార్లు పుట్టించారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తుందా ? లేదా ? అన్న ప్రశ్నకు కొరటాల క్లారిటీ ఇచ్చాడు.
Also Read: Viral Video: నడిరోడ్డులో బైక్ పైనే ముద్దుాలా? రెచ్చిపోయిన ప్రేమికుల వైరల్ వీడియో
కొరటాల ఏమి చెప్పాడు అంటే.. ‘నేను స్క్రిప్ట్ ని కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏ హీరోయిన్ కి కథ చెప్పలేదు. అలాగే ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు అని కొరటాల చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకి ఆలియా నో చెప్పిందంటూ వస్తున్న పుకార్లలో అసలు వాస్తవం లేదు అని తేలిపోయింది.
కాకపోతే, క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు.

అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.
Also Read:Minister Roja: మంత్రి రోజా మళ్లీ రావాలన్న జబర్దస్త్ టీం
[…] Also Read: Koratala Shiva: ‘ఎన్టీఆర్ హీరోయిన్’ పుకార్ల పై… […]