https://oktelugu.com/

Koratala Siva: ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తే ‘ఆచార్య’ లాంటి సినిమా వచ్చేది కాదు అంటూ చిరంజీవి పై కొరటాల శివ సెటైర్లు!

కొరటాల శివ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ, నేడు 'దేవర' మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా, ఆయన ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో ఆచార్య ఫ్లాప్ పై పరోక్ష కామెంట్స్ చేసాడు. ఈ ఇంటర్వ్యూ కి యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ యాంకర్స్ గా వ్యవహరించగా, ఎన్టీఆర్, కొరటాల శివ 'దేవర' విశేషాలను పంచుకున్నారు. అయితే ఆచార్య ఫ్లాప్ గురించి కొరటాల శివ పరోక్ష కామెంట్స్ చేస్తూ 'ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతం గా ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 05:00 PM IST

    Koratala Siva

    Follow us on

    Koratala Siva: అభిమానులకు తమ హీరోలు చిరకాలం గుర్తించుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలతో పాటు, ఎప్పటికీ మర్చిపోలేని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఇచ్చారు. అలా మెగా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటి ‘ఆచార్య’. వరుసగా రెండు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాల తర్వాత చిరంజీవి, #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, అపజయమే ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ, ఇలా వీళ్ళ ముగ్గురి కలయిక లో వచ్చిన చిత్రమిది. ఇలా అందరూ కెరీర్ పరంగా పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు జత కట్టి సినిమా చేస్తే అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయిలో ఊహించుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ చిత్రం, అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోకపోవడంతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

    అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కొరటాల శివ అనేక ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఈ చిత్రానికి ఆయన డైరెక్టర్ గా మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్ గా కూడా వ్యవహరించాడు. దీనివల్ల ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం కొరటాల శివ అని కొందరు, కాదు చిరంజీవి అని మరికొందరు కామెంట్స్ చేసేవారు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ చర్చలు నడిచేవి. చిరంజీవి అయితే బహిరంగంగా ఎన్నో సార్లు అసహనం వ్యక్తం చేస్తూ కొరటాల శివ పై పరోక్షంగా కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇన్నేళ్ల అనుభవం తో పని చేసిన నేను , సన్నివేశాలు బాగా రానప్పుడు, డైరెక్టర్స్ కి నా సూచనలు కొన్ని ఇస్తుంటాను. అలాంటివి పాటించినప్పుడే వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్స్ వస్తాయి. అలా కాకుండా నేను పెద్ద డైరెక్టర్ ని, నువ్వు ఏంటి నాకు సలహాలు ఇచ్చేది అనే విధంగా ప్రవర్తిస్తే ఫ్లాప్స్ ఎదురు అవుతుంటాయి’ అంటూ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లో అంటాడు.

    దీనిపై కొరటాల శివ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ, నేడు ‘దేవర’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా, ఆయన ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో ఆచార్య ఫ్లాప్ పై పరోక్ష కామెంట్స్ చేసాడు. ఈ ఇంటర్వ్యూ కి యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ యాంకర్స్ గా వ్యవహరించగా, ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ విశేషాలను పంచుకున్నారు. అయితే ఆచార్య ఫ్లాప్ గురించి కొరటాల శివ పరోక్ష కామెంట్స్ చేస్తూ ‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతం గా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి తెర లేపింది.