Maruthi Alto K10:  50 లక్షల సేల్స్.. 24 ఏళ్లుగా ఆదరణ.. ఇప్పటికీ వన్నె తగ్గని ఈ కారు గురించి తెలుసా?

కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ మోడల్ 24 ఏళ్లుగా ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు దీనిని 50 లక్షల మంది సొంతం చేసుకున్నారు. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ నేటి కాలంలోనూ ఈ మోడల్ ను ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదీ? ఈ కారుకు ఎందుకంత డిమాండ్?

Written By: Srinivas, Updated On : September 20, 2024 4:57 pm

Maruthi Alto K10

Follow us on

Maruthi Alto K10:  దేశంలో మారుతి కార్లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే కార్లు సామాన్యులతో పాటు అగ్రవర్ణాల వారిని ఆకట్టుకుంటాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లో మార్కెట్లోకి వచ్చి మారుతి కార్లు ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ ఇప్పటికీ అమ్మకాల్లో రారాజుగా నిలుస్తున్నాయి. అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఓ మోడల్ 24 ఏళ్లుగా ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు దీనిని 50 లక్షల మంది సొంతం చేసుకున్నారు. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ నేటి కాలంలోనూ ఈ మోడల్ ను ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదీ? ఈ కారుకు ఎందుకంత డిమాండ్?

ప్రస్తుతం కాలంలో ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతున్నాయి. వీటి తరువాత ఎస్ యూవీ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంత పోటీ ఉన్నా ఓ హ్యాచ్ బ్యాక్ కారు మాత్రం వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే అల్టో కే 10. ఆల్టో కారు 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో ఈ కారుకు ఫుల్ డిమాండ్ ఉండేది. అయితే ఆ తరువాత మార్కెట్లో జరిగిన మార్పులతో పాటు కొత్త కార్లు రావడంతో ఆల్టో కే హవా తగ్గింది. అయితే ఇందులో ఫీచర్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రావడంతో ఈకారును ఆదరిస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు 50 లక్షల మంది కొనుగోలు చేశారు.

ప్రస్తుతం ప్రతినెల 10 వేల కార్లు అమ్ముడవుడున్న ఈ కారులో ఉన్న కొన్ని ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆల్టో కే 10 సిరీస్ మోడల్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ తో 66 బీహెచ్ పీ పవర్ వద్ద 99 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్సన్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజిన్ పై 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ వేరియంట్ లో 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్టాపింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఇందులో ఫ్రంట్ సీట్ బెల్ట్, పవర్ రేంజ్ ఫ్రీ, స్పీడ్ సెన్సిటివ్, ఆటోమేటిక్ డోర్ లాక్స్ ఉన్నాయి. ఇందులో రీ డిజైన్ చేయబడిన స్టీరింగ్ వీల్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యూఎస్ బీ, బ్లూ టూత్ , ఏయూఎక్స్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే 7 అంగుళాల ప్లోటింగ్ టచ్ స్క్రీన్ ఉంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన కొత్తలో విదేశాల్లో మాత్రమమే కనిపించేది. ఆ తరువాత దేశంలో ఈ కారుకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ కారును ఆదరించడం చూసి ఆటోమోబైల్ లో తీవ్ర చర్చ సాగుతోంది.

ప్రస్తుతం పోటీ ప్రపచంలో ఎన్నికార్లు మార్కెట్లోకి వచ్చినా మారుతి కి చెందిన అల్టో కే 10 కు ఆదరణ పెరగానికి ధర కూడా కారణం అంటున్నారు. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ ఈ కారు అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోకి ఈ కారు రూ.3.39 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.