Koratala Siva: అప్పుడెప్పుడో ‘భరత్ అనే నేను’ సినిమా తీశాడు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఆచార్య సినిమా తీశాడు కొరటాల శివ. అలా రెండు సినిమాల మధ్య లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఆ మాటకొస్తే.. మొదటి నుంచి ఇంతే. కొరటాల కెరీర్ గ్రాఫ్ చూస్తే.. చాలా స్లో డైరెక్టర్ అని అర్ధం అవుతుంది. దీనికి తోడు, మధ్యలో కరోనా/లాక్ డౌన్ వచ్చింది. సరే, మళ్లీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా అని, ఇక హ్యాపీ అనుకున్నప్పటికీ.. మరోసారి ఈ దర్శకుడి తన కెరీర్ లో గ్యాప్ తప్పేలా లేదు.

లెక్కప్రకారం, ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తీయాలి కొరటాల. ఈ విషయాన్ని ఈ దర్శకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు కూడా. ఇక ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ ఈసారి సిద్ధంగా ఉన్నట్టు లేడు. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ పై మంచి పట్టు ఉంది. తారక్ ను ఒప్పించడం త్రివిక్రమ్ కే చేత కాలేదు.
Also Read: F3 Movie Business: ఇంతకీ ‘ఎఫ్ 3’ బిజినెస్ సంగతి ఏమిటి ?
అందుకే, సైలెంట్ గా త్రివిక్రమ్ మహేష్ సినిమా పైకి వెళ్ళిపోయాడు. మరి ఈ లెక్కన, కొరటాల.. ఎన్టీఆర్ ను ఎలా ఒప్పిస్తాడు ? కథలో మలుపుల దగ్గర నుంచి ఎమోషన్ వరకూ అన్నీ ఆలోచించే ఎన్టీఆర్ కి, కొరటాల కథ నచ్చుతుందా ? నచ్చకపోతే సినిమా పోస్ట్ ఫోన్ అయినట్టే. అదే కనుక జరిగితే కొరటాల, మరికొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సిందే.

పోనీ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి ట్రై చేశాడంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ది పాన్ ఇండియా మార్కెట్. పైగా గత ఆరు సినిమాలుగా ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే.. కొరటాల ఎన్టీఆర్ కోసం ఎన్నేళ్లు అయినా ఎదురుచూస్తూ ఉండాల్సిందే.
నిజానికి ఆచార్య సినిమాకి ముందు కూడా ఇదే జరిగింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య చిరంజీవితో కొరటాల సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందుకే.. ఈ సారి హీరోని బట్టి స్క్రిప్ట్ రాయకుండా.. స్క్రిప్ట్ ను బట్టే హీరోని సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కొరటాల కథకు ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అట. మరి ఏమవుతుందో చూడాలి.
Also Read:Poorna Remuneration: మీకు పూర్ణ కావాలా ? ఐతే రోజుకింత ఇవ్వండి ?
Recommended videos
[…] Also Read: Koratala Siva: ప్చ్.. ‘కొరటాల’ కు మళ్లీ లాంగ్ గ్… […]
[…] Also Read: Koratala Siva: ప్చ్.. ‘కొరటాల’ కు మళ్లీ లాంగ్ గ్… […]