Kooku With Jathiratnalu 2 Elimination: ‘ ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్టార్ మా ఛానల్ లో , విహాయవంతంగా నడుస్తున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’. మొదటి సీజన్ లాగానే, రెండవ సీజన్ కూడా బంపర్ హిట్ అయ్యింది. ఈ రెండవ సీజన్ లో కుక్స్ గా కొనసాగుతున్న వారు ప్రస్తుతం 8 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం శ్రీకాంత్ అయ్యంగార్ , కళ్యాణ్ పడాల మాత్రమే ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. గత వారం మరో ఎలిమినేషన్ జరగాల్సింది కానీ , ఎందుకో యాజమాన్యం ఎలిమినేషన్ వైపు వెళ్ళలేదు. అయితే రీసెంట్ గానే ఈ షో నుండి మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట.
చాలా మంది చెప్తున్నది ఏమిటంటే , ఈ షో నుండి తనూజ ఎలిమినేట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ లో ఈమె టాప్ 6 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యింది , కానీ ఈ సీజన్ లో ఇంకా ముందే ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే విధంగా ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన మరో టాప్ కంటెస్టెంట్ పల్లవి రామస్వామి. ఈ షో లో మొత్తం ఇద్దరు పల్లవి లు ఉన్నారు. ఒక పల్లవి మొదట్లో కాస్త తడబడింది , కానీ ఇప్పుడు మాత్రం టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతుంది. ఇక రెండవ పల్లవి మాత్రం మొదట్లో బాగా చేసేది కానీ , ఇప్పుడు కాస్త తడబడుతూ తక్కువ స్కోర్ తెచ్చుకోవడం వల్ల , ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా తేజశ్వని గౌడ పేరు బలంగా వినిపిస్తోంది.
అమర్ దీప్ సతీమణి గా ఈమెకు ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక పక్క సీరియల్స్ చేస్తూనే, మరోపక్క ఇలాంటి షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఇది వరకు ఏ షో లో పాల్గొన్న టాప్ మోస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ వచ్చేది. కానీ ఈ షో లో ఎందుకో గత రెండు వారాలుగా ఈమె బాగా వెనకబడింది. ఆరంభం లో టాప్ 2 లేదా టాప్ 3 రేంజ్ మార్కులు సంపాదించుకుంటూ వచ్చిన తేజస్విని , ఇప్పుడు వరుసగా డేంజర్ జోన్ లోకి రావడం మొదలు పెట్టింది , ఈ క్రమంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

