మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, ఇప్పుడు అతని రెండో సినిమా ‘కొండపొలం’కి మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.

కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో.. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, వైష్ణవ్ తేజ్ పాత్రలోని షేడ్స్ ను, అలాగే రకుల్ తో సాగే లవ్ ట్రాక్ ను మరియు అన్నిటికి కంటే ముఖ్యంగా సినిమాలోని కీలకమైన అడవి నేపథ్యాన్ని… ఆ నేపథ్యం తాలూకు ఆపదలను, ఆ ఆపదల కారణంగా హీరో ఎదుర్కొనే అవరోధాలను క్రిష్ హృదయాన్ని తాకేలా అద్భుతంగా తెరకెక్కించాడు.
ఇక ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్ పాత్రలోని వేరియేషన్స్ తో పాటు అతని కుటుంబ పరిస్థితులను కూడా బాగా చూపించారు. నటన పరంగా కూడా వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించాడు. అతని కళ్ళల్లోని ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికాయి. ట్రైలర్ లో వైష్ణవ్, రకుల్ తో పాటు కోట శ్రీనివాసరావు పాత్ర కూడా బాగా ఎలివేట్ అయింది.
మేకలు కాసుకునే పూర్తి గ్రామీణ యువతిగా రకుల్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎలాగూ ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఈ కొండపొలంతో కూడా మరో భారీ హిట్ అందుకునేలా ఉన్నాడు. పైగా ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు.
పూర్తి అడవి మరియు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ చాలా సహజంగా ఉంటుందట. పక్కా ఎమోషన్ తో నడిచే సినిమా కావడంతో ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాని మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూ కూడా వేసారు. సినిమా అవుట్ ఫుట్ పట్ల ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
