spot_img
Homeఎంటర్టైన్మెంట్Kona Venkat Emotional Story: ఆరోజు ఆ అమ్మాయిని చూడకపోయుంటే చనిపోయేవాడిని అంటూ కోన వెంకట్...

Kona Venkat Emotional Story: ఆరోజు ఆ అమ్మాయిని చూడకపోయుంటే చనిపోయేవాడిని అంటూ కోన వెంకట్ ఎమోషనల్ కామెంట్స్..

Kona Venkat Emotional Story: రచయితగా , నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సొంతం చేసుకున్న వ్యక్తి కోన వెంకట్(Kona Venkat). ఈమధ్య కాలం లో ఈయన నిర్మాతగానే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. ‘కోర్టు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రోషన్(Roshan), శ్రీదేవి(Sridevi) లను హీరో హీరోయిన్లుగా పెట్టి ‘బ్యాండ్ మేళం'(Band Melam) అనే చిత్రాన్ని నిర్మించాడు కోనవెంకట్. రీసెంట్ గానే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సందర్భంగా ఆయన రోషన్, శ్రీదేవి లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లోని పలు థియేటర్స్ లో సక్సెస్ టూర్స్ ని నిర్వహించాడు. అలా నిన్న ఆయన వైజాగ్ లోని శ్రీ మెలోడీ థియేటర్ కి విచ్చేశాడు. అక్కడ ఆయన అభిమానులను ఉద్దేశించి తన జీవితం లో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడి ఉన్నానంటే అందుకు కారణం ఒక అమ్మాయి. సినీ ఇండస్ట్రీ లోకి ఇంకా అడుగుపెట్టని రోజుల్లో నేను నా జీవితం లో ఎన్నో కష్టాలను చూసాను. నా చేతిలో ఉన్న డబ్బులు మొత్తం పోయాయి. చివరిగా మిగిలిన డబ్బులతో ఒక వాటర్ బాటిల్, 30 కి పైగా నిద్ర మాత్రలు కొనుక్కొని చెన్నై బీచ్ వద్దకు వచ్చాను. అవి మింగి అక్కడే చనిపోదాం అనుకున్నాను. అప్పుడే ఒక అమ్మాయి హార్ట్ షేప్స్ లో ఉన్న బెలూన్స్ ని అమ్ముతూ నా కంటికి కనిపించింది. ఆ అమ్మాయి కి కాళ్ళు లేవు , చేతులు లేవు, ఆమె పక్కనే సహాయం గా తన అన్నయ్య కూడా ఉన్నాడు. తానూ నా వద్దకు వచ్చి అన్నయ్య, ఒక్క బెలూన్ తీసుకోండి అని అడిగింది. నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు’.

‘కాళ్ళు చేతులు లేకపోయినా ఆ అమ్మాయి బ్రతుకు తెరువు కోసం అంతలా కష్టపడడం చూసి, ఇలాంటి ఆలోచన వచ్చినందుకు నా మీద నాకే సిగ్గు వేసింది. చనిపోతే ఏమి రాదు, కష్టపడితే జీవితం లో కచ్చితంగా అవకాశాలు వస్తాయని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇక అప్పటి నుండి రెట్టింపు ఉత్సాహం తో కష్టపడ్డాను , సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి, వరుసగా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలకు నా కలం పనిచేసింది. నేడు ఈ స్థాయికి ఎదిగి మీ ముందు ఇలా నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కోన వెంకట్. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి , యువతకు ఆదర్శవంతమైన ఉపన్యాసం ఇచ్చారంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular