Indian Filmmakers Breaking Records: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని కూడా పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు వాళ్ళు చేసే సినిమాలతో తెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులందరిలో అటెన్షన్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గుర్తుంచుకునే సినిమాలను చేసిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
రాజ్ కుమార్ హిరానీ
ఈ దర్శకుడు ‘త్రీ ఇడియట్స్’ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించాడు. స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు అనేది చాలా క్లియర్ కట్ గా చేసి చూపించాడు… ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఇండియాలో ఉన్న భారీ రికార్డులను బద్దలు కొట్టి కొత్త హిస్టరీ ని క్రియేట్ చేసింది…
రాజమౌళి
‘బాహుబలి’ సినిమాతో ఒక విజువల్ వండర్ ని తెరకెక్కించిన రాజమౌళి సినిమా కంటెంట్ అంటే ఎలా ఉండాలి దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలా కొత్తగా చూపించి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే బాహుబలి తో ఆయన క్రియేట్ చేసిన వండర్స్ మరొక ఎత్తనే చెప్పాలి…
నితీష్ తివారి
‘దంగల్’ సినిమాతో ఒక మోటివేషనల్ సినిమాని ప్రేక్షకులకు అందించి ఎవ్వరైనా గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది చేసి చూపించాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా క్రియేట్ చేయాలనే ఈ మూవీ చేసింది. ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు…
వీళ్ళ తర్వాత చాలామంది వీళ్ళ బాటలోనే సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికి వీళ్లు మాత్రం మొదటగా వల్ల ఐడియాలజీతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశారు. కాబట్టి వీళ్లను మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమైతే ఉంది…
