Ravindar Chandrasekaran: గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్. కోలీవుడ్ లో అడపాదడపా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న కానీ వాటి ద్వారా కంటే కూడా గత ఏడాది సీరియల్ నటి మహాలక్ష్మి శంకర్ ను పెళ్లి చేసుకోవడం తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు చంద్రశేఖరన్ .
ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్న చంద్రశేఖరన్ ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వాళ్ళు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఒక పారిశ్రామిక వేత్త ను మోసం చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (పవర్ జనరేట్ ) లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు ఆర్జించవచ్చని చంద్రశేఖరన్ నమ్మబలికాడు.
దీంతో ఆ పారిశ్రామికవేత్త ఆ మాటలు నమ్మేసి, ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ తయారుచేసి, చెన్నై కి చెందిన బాలాజీ అనే ఆ పారిశ్రామిక వేత్తను ఈ ప్రాజెక్టు లోకి తీసుకున్నాడు రవీందర్ . అందుకు గాను దాదాపు 15. 83 కోట్లు తీసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17, 2020 నా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే రవీందర్ చంద్రశేఖరన్ మొదట చెప్పిన రిజల్ట్స్ చూపించలేకపోయారు.
దీంతో తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని బాలాజీ అడగటంతో రవీందర్ నుండి సరైన సమాధానం రాలేదు. దీనితో రవీందర్ చేసిన మోసపూరితమైన పనులతో పాటు గా ఆర్థికపరమైన మోసాలను సాక్ష్యాలతో సహా వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి రిపోర్ట్ చేశాడు బాలాజీ. అన్ని వివరించిన క్రైమ్ బ్రాంచ్ రవీందర్ ను అరెస్ట్ చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.