https://oktelugu.com/

Koffee With Karan Season 8: కాఫీ విత్ కరణ్ 8: కరణ్ జోహార్ దాచేసిన ఆ రహస్యం బయటపడింది

ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ సీజన్ 8 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో వస్తుంది. షో లో భాగంగా కరణ్ జోహర్ వచ్చిన సెలబ్రిటీలతో రాపిడ్ ఫైర్ రౌండ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 25, 2024 / 06:42 PM IST

    Koffee With Karan Season 8

    Follow us on

    Koffee With Karan Season 8: బాలీవుడ్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఎనిమిదో సీజన్ జరుగుతోంది. ప్రతి సీజన్ తరహాలోనే సౌత్ స్టార్స్ షోలో సందడి చేస్తున్నారు. సినిమాల విషయాలే కాకుండా పర్సనల్ విషయాలను కూడా కరణ్ జోహార్ అడుగుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు షోకి వచ్చిన గెస్టులు ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తే కౌంటర్ కూడా ఇస్తారు.

    ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ సీజన్ 8 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో వస్తుంది. షో లో భాగంగా కరణ్ జోహర్ వచ్చిన సెలబ్రిటీలతో రాపిడ్ ఫైర్ రౌండ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ అభిమానుల కోసం కాఫీ హంపర్ ను రివీల్ చేశారు.

    హంపర్ రివీల్ కి సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. కాఫీ విత్ కరణ్ గ్లోరియస్ హంపర్ ను కరణ్ జోహర్ రివీల్ చేశారు. ఇందులో ముందుగా తన బ్రాండ్ తియానీ జ్యువెలరీతో ఈ జాబితా స్టార్ట్ చేశారు. తరువాత గోప్రో హీరో 11 బ్లాక్ కెమెరా, సోనీస్ మూవ్ వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్స్, గూగుల్ పిక్సెల్ 8 ప్రో, థెరాబాడీ ఎలైట్ మసాజ్ గన్, వైవ్స్ సెయింట్ లారెంట్ పెర్ఫ్యూమ్, ఎల్ ఆక్సిటేన్ షవర్ ప్రొడక్ట్స్ మరియు చీజ్ నైఫ్, ఆనందిని హిమాలయ టీ.. అలాగే సెవెన్ బేక్ హౌస్ గిఫ్ట్ బాక్స్, పస్కాటి ఆర్టిసాన్ చాక్లెట్, టెనాసియస్ బీ కలెక్టివ్ తో హిమాలయన్ తేనే, 28 బేకర్స్ స్ట్రీట్ డెజర్టులు ఉన్నాయి. చివరగా కాఫీ విత్ కరణ్ 8 మగ్ ఉన్నాయి.

    ఈ వీడియో క్లిప్ ను అభిమానులతో పంచుకున్న కరణ్ జోహర్ .. కాఫీ విత్ కరణ్ షోలో గౌరవ అతిథి వేరే ఎవరో కాదు.. కాఫీ హంపర్ నేనని..దాన్ని రహస్యంగా ఉంచడం లేదని క్యాప్షన్ లో పేర్కొన్నారు.