Upasana’s Birthday : మెగా ఫ్యామిలీలో క్లిన్ కార రాక చెప్పలేని ఆనందాన్ని నింపింది. ఏళ్ల తరబడి ఎదురు చూసిన నిరీక్షణకు తెర పడడంతో సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన-రామ్ చరణ్ దంపతులు పేరెంట్స్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ నెలలో చిరంజీవి ఉపాసన తల్లైన విషయం అభిమానులకు తెలియజేశారు. జూన్ 20న ఉపాసనకు డెలివరీ అయ్యింది. జూన్ 21వ తేదీ ఉదయాన్నే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
నేడు ఉపాసన బర్త్ డే కాగా ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఉపాసనకు నెలలు నిండాక కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన ఆత్రుత, బిడ్డను చూడాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. వారి మనసు పడిన సంఘర్షణ ఈ వీడియోలో తెలియజేశారు. తొమ్మిదో నెలల నుండి అసలు కథ మొదలైందని ఉపాసన చెప్పుకొచ్చారు. బిడ్డను ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటామా అని ఎదురు చూసినట్లు చిరంజీవి తెలిపారు.
11 ఏళ్ల నిరీక్షణ చాలా ఎగ్జైట్మెంట్ ఫీలైనట్లు ఉపాసన తల్లి గారు చెప్పారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ… 11 ఏళ్ళు అయిపోతుంది మీరు ఏం చేస్తున్నారనే ఒత్తిడి అందరి నుండి ఎదురుకున్నట్లు చెప్పుకొచ్చారు. డెలివరీ అయిన సమయంలో రామ్ చరణ్ అక్కడే ఉన్నారు. మొదటిగా రూమ్ లోపలికి వెళ్లి చూసింది రామ్ చరణే. బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు.
ఈ వీడియోలో క్లిన్ కార బారసాల కార్యక్రమం కూడా చూపించారు. క్లిన్ కార బారసాల చాలా స్పెషల్ గా నిర్వహించినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ నృత్య కళాకారులు వచ్చారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన కూతురిని చూపించాడు. అయితే పూర్తిగా ముఖం రివీల్ చేయలేదు. నేడు రామ్ చరణ్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే క్లిన్ కార… కొణిదెల, కామినేని కుటుంబాలకు ఎంత అపురూపమో తెలుస్తుంది. కాగా క్లిన్ కార కోసం ఉపాసన గదిని ప్రత్యేకంగా ఇంటీరియర్ చేయించింది. ఫారెస్ట్ థీమ్ తో డిజైన్ చేయించి నర్సరీ అని పేరు పెట్టింది.
View this post on Instagram