Baby Movie collections : తక్కువ బడ్జెట్ లో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా సినిమాలు తీసి, కేవలం కంటెంట్ బలంతో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్స్ గా నిలిచి కాసుల కనకవర్షం కురిపించిన సినిమాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. ఈ ఏడాది కూడా అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ ఏడాది మన టాలీవుడ్ సక్సెస్ రేషన్ లో అధిక శాతం చిన్న సినిమాలే ఉండడం విశేషం.
రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ చిత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విస్ఫోటనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం విడుదల రోజు నుండి అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకుంటూ వచ్చిన ప్రాంతాలలో ఒక నైజాం. ఈ ప్రాంతం లో మొదటి వారం ఈ సినిమా 9 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది. అలాగే సీడెడ్ లో 3 కోట్ల రూపాయిలు , ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 60 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి లో 90 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో కోటి 20 లక్షల రూపాయిలు , గుంటూరు జిల్లాలో కోటి 10 లక్షల రూపాయిలు, నెల్లూరు లో 70 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మొత్తం మీద ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులకు గాను 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది.
ఇక ఆ తర్వాత కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 83 లక్షల రూపాయిల షర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే. అంటే పెట్టిన డబ్బులకు మూడింతలు పైగా లాభాలు కేవలం మొదటి వారం లోనే వచ్చాయి అన్నమాట.