Kiskindhapuri Collection Day 1: మాస్ ఆడియన్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas). ‘అల్లుడు శ్రీను’ అనే సూపర్ హిట్ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన శ్రీనివాస్, ఆ తర్వాత తనదైన శైలిలో భిన్నమైన జానర్స్ ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ మధ్యలో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఆయన నుండి విడుదలైన చివరి సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసుడు’. ఆ తర్వాత విడుదలైన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆయన గత చిత్రం ‘భైరవం’ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్మాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు, కానీ నేడు విడుదలైన ‘కిష్కిందపురి'(Kiskindhapuri Movie) చిత్రానికి ఆడియన్స్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరెకెక్కిన ఈ సినిమాని చూసి ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
కానీ ఈ చిత్రానికి విడుదలకు ముందు అంచనాలు భారీగా లేవు, ఆ కారణం చేత ఓపెనింగ్ వసూళ్లు నూన్ షోస్ వరకు పెద్దగా లేవు కానీ, పాజిటివ్ మౌత్ టాక్ జనాల్లో బాగా వ్యాప్తి చెందడం తో మ్యాట్నీ షోస్ నుండి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దీంతో ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిల్చింది. ప్రస్తుతానికి బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని, సినిమాకు పబ్లిక్ లో మంచి టాక్ ఉంది కాబట్టి, రేపు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతాయని, అలా రోజురోజుకు వసూళ్లు పెరుగుతూ వెళ్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ కి ఒక మంచి కమర్షియల్ హిట్ అందినట్టే అనిపిస్తుంది.
హారర్ జానర్ చిత్రాలకు క్రేజ్ తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఒక సరికొత్త కథాంశంతో సినిమాని తెరకెక్కించడం తో చూసే ఆడియన్స్ కి అనేక సన్నివేశాలు చాలా అద్భుతంగా అనిపించాయి. ఇలాంటి సినిమాలను టీవీ లో చూస్తే కిక్ రాదు, థియేటర్ లో చూస్తేనే కిక్,కచ్చితంగా మిస్ కాకుండా థియేటర్స్ లో చూసే సినిమా అని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. అంతే కాదు, ప్రతీ సినిమాలో తప్పులు వెతికే కొంతమంది క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారంటే కచ్చితంగా సినిమాలో బలమైన మ్యాటర్ ఉందని అర్థం అవుతుంది. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు చేరుకోగలదు అనేది.