KishkindhaPuri Movie Collection: ‘భైరవం’ వంటి ఫ్లాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన ‘కిష్కింధపురి'(KishkindhaPuri Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య కాలం లో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ నుండే బెస్ట్ మూవీ అంటే ఇదే. కేవలం ఆయన కెరీర్ లోనే కాదు, ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి చాలా కాలం తర్వాత ఒక మంచి హారర్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. అయితే మొదటి రోజు మిరాయ్ చిత్రం తో క్లాష్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు బాగా తక్కువ వచ్చిన మాట వాస్తవమే. కానీ మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో ఈ చిత్రం మొదటి వర్కింగ్ డే లో అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ సెంటర్స్ లో ‘మిరాయ్’ కంటే ఈ చిత్రానికే మంచి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి.
10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో కలిసి కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రెండవ రోజున కోటి 82 లక్షలు, మూడవ రోజున 2 కోట్ల 5 లక్షల, నాల్గవ రోజున కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, నాలుగు రోజుల్లో 11 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు 6 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 7 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 14 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 2 కోట్ల 82 లక్షలు, సీడెడ్ ప్రాంతం లో 45 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో మూడు కోట్ల 6 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్/ తెలంగాణ చూస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలలకు కలిపి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. 75 శాతానికి పైగా రికవరీ రేట్ ని సాదించిన ఈ చిత్రం, మరో రెండు కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. రేపు మరియు ఎల్లుండి వచ్చే వసూళ్లతో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెడుతుంది ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ అంటున్నారు. ఓజీ చిత్రం వచ్చే వరకు, ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.