Kishkindhapuri First Glimpse: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అదే రీతిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ‘ఛత్రపతి’ (Chatrapathi) సినిమాను హిందీలో రీమేక్ చేసి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆయన అరకొర విజయాలు మాత్రమే సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ ఇకమీదట వచ్చే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఆయన నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. ఇక అందులో ‘కిష్కింధపురి’ (Kishkinda puri) అనే సినిమా ఒకటి… అయితే ఈ సినిమా దయ్యాలు, ఆత్మల నేపథ్యంలో నడుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ఇప్పటివరకు ఇలాంటి కథతో అయితే రాలేదు. కాబట్టి ఈ సినిమా తనకు ఒక కొత్త అటెంప్ట్ అనే చెప్పాలి. అయినప్పటికి గ్లింప్స్ లో చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే చూపించారు. ఇక గ్లింప్స్ ను చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు తన ఫ్రెండ్స్ కలిసి ఒక మిస్టేరియస్ ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఒక కోట డోర్స్ మొత్తం లాక్ అవుతాయి.
ఎందుకని వాళ్ళు అక్కడికి వెళ్లారు డోర్స్ లాక్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. అక్కడ నిజంగానే ఆత్మలు, దయ్యాలు ఉన్నాయా? లేదంటే ఎవరైనా కావాలనే ఇలాంటి కొన్ని కుట్రలు పన్నుతున్నారా అనే విషయాలను సస్పెన్స్ తో ప్రేక్షకులకు చెప్పడానికి ఈ సినిమా అయితే సిద్ధమవుతుంది.
కౌశిక్ పగళ్లపాటి అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుడిని కచ్చితంగా ఎంగేజ్ చేయగలుగుతుంది అనే నమ్మకంతో మూవీ టీమ్ అయితే ఉన్నారు. ఇక తన అభిమానులు సైతం ఆయన నుంచి ఇలాంటి సినిమాలను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి తను కూడా ఈ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ గ్లింప్స్ అంత బాగానే ఉన్నప్పటికి కొన్ని విజువల్స్ మాత్రం సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘ఊరుపేరు భైరవకోన’ అనే సినిమాలోని షాట్స్ మాదిరిగానే అనిపిస్తున్నాయి…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఒక భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సి ఎస్ కూడా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ని అందించినట్టుగా తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే తీసుకొచ్చాడు…
