https://oktelugu.com/

Kishkindha Kaandam Movie Review : కిష్కింద కాండం ఫుల్ మూవీ రివ్యూ…

Kishkindha Kaandam Movie Review ఇక ఈ సినిమా ఈరోజు నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 19, 2024 / 09:46 PM IST

    Kishkindha Kaandam Movie Review

    Follow us on

    Kishkindha Kaandam Movie Review  మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి కథలు వస్తుంటాయి. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి సినిమాలో ఎలాంటి కంటెంట్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన విషయాలను చాలా డీప్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే కిష్కింద కాండం అనే సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఈరోజు నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఫారెస్ట్ పక్కన ఉన్న విలేజ్ లో అప్పు పిల్లై (విజయ్ రాఘవన్), తన కొడుకు అజయ్ చంద్ర (ఆసిఫ్ అలీ), కోడలు ప్రవీణ (వైష్ణవి రాజ్), మనవడు చాచు (ఆరవ్) తో కలిసి ఉంటాడు. అయితే ఒకరోజు అప్పు పిళ్ళై కోడలు అయిన ప్రవీణ చనిపోతుంది. దాంతో ఆమె కొడుకు అయిన చాచూ వాళ్ల అమ్మని ఎవరు చంపేశారనే విషయాలను తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు… ఇక తన ఇన్వెస్టిగేషన్ లో తనకు ఏం తెలిసింది. అసలు ప్రవీణ చనిపోయిందా లేదంటే ఆమెను ఎవరైనా చంపేశారా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు దిన్ జిత్ అయ్యత్తన్ ఎంచుకున్న స్టోరీ గాని ఆయన స్క్రీన్ మీద చూపించిన ప్రజెంటేషన్ గాని చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఒక పవర్ఫుల్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చాడు ఆర్టిస్టులను వల్ల పర్ఫామెన్స్ ని పూర్తిగా రాబట్టుకొని సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో తను చాలా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక సినిమా సీన్లకు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. కొన్ని సీన్లలో గుజ్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ ని ఇవ్వడంలో దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్ చాలావరకు హెల్ప్ చేశారనే చెప్పాలి… ఇక స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాడు. ఎక్కడైతే ప్రేక్షకుడిని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లోకి తీసుకెళ్లాలని చూశాడు అలాగే ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు మీకు ఏది ఏమైనా కూడా చాలా తక్కువ క్యారెక్టర్లతో ఒక ఇంటెన్సీ డ్రామాని క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ వినిపించిన దర్శకుడు ఈ సినిమాని విజయతీరాలకు చేర్చాడు… ప్రతి క్రాఫ్ట్ లని దర్శకుడు వాడుకున్న విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు తన ప్రతిభని నిరూపించుకున్న సినిమా ఇది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ వల పూర్తి ఎఫెక్ట్ ని పెట్టి ఈ సినిమాలో నటినట్టుగా తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఆసిఫ్ అలీ, విజయ్ రాఘవన్, అపర్ణ బాలమురళీ వాళ్ళ చూపిస్తూ చాలా చక్కటి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు ఇక ప్రేక్షకుడు కోరుకుంటుంది ఏంటి అతనికి ఏం కావాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకొని మరి అలాంటి ఒక పర్ఫామెన్స్ ని ఇవ్వడంలో యాక్టర్స్ కూడా చాలావరకు కీలకపాత్ర వహించారు…ఇక వీళ్ళతో పాటుగా చిన్న చిన్న క్యారెక్టర్లు వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ సినిమా సక్సెస్ లో భాగమయ్యారు..

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే టెక్నీషియన్ అందరి కూడా వాళ్ళ ప్రాణం పెట్టి వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక దానికి అనుగుణంగానే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా చక్కటి మ్యూజిక్ అయితే ఇచ్చాడనే చెప్పాలి. ఇక ఎడిటర్ కూడా చాలా చక్కగా ఎడిట్ చేశాడు…

    ప్లస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    బ్యా గ్రౌండ్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    స్టార్టింగ్ లో బోర్ సీన్స్

    రేటింగ్

    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5