https://oktelugu.com/

Kiran Abbavaram ‘Ka’ Movie : తెలుగు సినిమాని తొక్కేస్తున్న డబ్బింగ్ మూవీస్..కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ కి థియేటర్స్ కొరత!

లక్కీ భాస్కర్ నిర్మాత నాగ వంశీ కావడంతో ఈ చిత్రానికి థియేటర్స్, షోస్ భారీగానే దొరికాయి. కానీ కిరణ్ అబ్బవరం 'క' చిత్రానికి హైదరాబాద్ వంటి సిటీస్ లో కేవలం 198 షోస్ మాత్రమే దొరకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కి హైదరాబాద్ లో 314 షోస్, కన్నడ డబ్బింగ్ చిత్రం 'భగీర' కి 202 షోస్ ని కేటాయించారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 30, 2024 / 09:20 PM IST

    Kiran Abbavaram 'Ka' Movie

    Follow us on

    Kiran Abbavaram ‘Ka’ Movie : డబ్బింగ్ సినిమాలు మన టాలీవుడ్ సినిమాలను తొక్కేయడం కొత్తేమి కాదు. దశాబ్ద కాలం నుండి ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. దురదృష్టం ఏమిటంటే మన టాలీవుడ్ నిర్మాతలే వాటిని విడుదల చేస్తూ ఉంటారు. పైకి మాత్రం తెలుగు సినిమాని కాపాడండి అంటూ నాటకాలు ఆడుతారు, కానీ వీళ్ళే డబ్బింగ్ సినిమాలను కొనుగోలు చేసి మన తెలుగు సినిమాలను తొక్కుతుంటారు. రేపు రెండు డబ్బింగ్ సినిమాలు, రెండు తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ చిత్రం తో పాటు కన్నడ చిత్రం ‘భగీర’ తెలుగులో దబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. అలాగే మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు లో నటించిన ‘లక్కీ భాస్కర్’, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు విడుదల అవుతున్నాయి.

    లక్కీ భాస్కర్ నిర్మాత నాగ వంశీ కావడంతో ఈ చిత్రానికి థియేటర్స్, షోస్ భారీగానే దొరికాయి. కానీ కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి హైదరాబాద్ వంటి సిటీస్ లో కేవలం 198 షోస్ మాత్రమే దొరకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తమిళ డబ్బింగ్ చిత్రం ‘అమరన్’ కి హైదరాబాద్ లో 314 షోస్, కన్నడ డబ్బింగ్ చిత్రం ‘భగీర’ కి 202 షోస్ ని కేటాయించారు. ‘అమరన్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి, డిమాండ్ ఉంది కాబట్టి పర్వాలేదు ఇచ్చారు అనుకోవచ్చు. కానీ ‘భగీర’ చిత్రానికి హైదరాబాద్ సిటీ మొత్తం కలిపి చూస్తే ఒక్కటంటే ఒక్క షో కూడా హౌస్ ఫుల్ అవ్వలేదు. అలాంటి సినిమాకి ‘క’ కంటే ఎక్కువ షోస్ ఇవ్వడం ఏమిటి?, బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల సినిమాలను ఇంత దారుణంగా తొక్కేస్తారా?, అడిగేవాళ్ళు లేరు అనే కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాల్సిన షోస్ దొరకకపోవడంతో ‘క’ చిత్రానికి నేడు హైదరాబాద్ లోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ వేసుకున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కి ఒక్క టికెట్ కూడా మిగలకుండా హాట్ కాక్స్ లాగా సేల్ అయ్యాయి.

    దీనిని బట్టీ చూస్తే ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉంది, కానీ థియేటర్స్ మాత్రం లేవు. మరోపక్క పెద్ద నిర్మాత నుండి విడుదల అవుతున్న సినిమా కావడంతో ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఒక్క హైదరాబాద్ నుండే 420 షోస్ ని షెడ్యూల్ చేసారు. కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా లక్కీ భాస్కర్ చిత్రం కారణంగా ‘క’ చిత్రానికి థియేటర్స్ దొరకడం లేదు. చిన్న సినిమా పట్ల ఈ స్థాయి అన్యాయం మనం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ విషయంలో చూసాము. కానీ ఆ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ‘క’ చిత్రం కూడా అలా లాంగ్ రన్ లో అద్భుతాలు సృష్టిస్తుందో లేదో చూడాలి.