https://oktelugu.com/

 Ka Movie Collections  : కిరణ్ అబ్బవరం ‘క’ 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..అంచనాలు మొత్తం తారుమారు..ఆ హీరోనే కాపాడాలి!

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో కలిపి కేవలం 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అదే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వరుసగా నాలుగు రోజులు వచ్చింది. నాల్గవ రోజు దాదాపుగా మొదటి రోజు తో సమానంగా రెండు కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 06:34 PM IST

    Ka Movie Collections

    Follow us on

    Ka Movie Collections  :  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘క’ విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. అయితే ఓపెనింగ్స్ లో ఉన్న ఊపు, ఫుల్ రన్ లో లేదు అనే చెప్పాలి. దీపావళి కానుకగా ఈ చిత్రంతో పాటు లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలు విడుదలయ్యాయి. మొదటి నాలుగు రోజులు ‘క’ చిత్రం మాస్ సెంటర్స్ లో ఈ రెండు సినిమాలను ఒక రేంజ్ లో డామినేట్ చేసింది. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ టార్గెట్ కి ఆమడదూరంలోనే ఆగిపోయేట్టు అనిపిస్తుంది. మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము.

    మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో కలిపి కేవలం 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అదే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వరుసగా నాలుగు రోజులు వచ్చింది. నాల్గవ రోజు దాదాపుగా మొదటి రోజు తో సమానంగా రెండు కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత 5 వ రోజు నుండి చిన్నగా వసూళ్లు తగ్గుతూ వచ్చింది. 11 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్స్ వచ్చాయి. 11 వ రోజు కూడా దాదాపుగా కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత నుండి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం 21 రోజులకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలు, ఓవర్సీస్ లో 3 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మూడు వారాలకు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుంది అనుకున్న ఈ చిత్రం, కేవలం 40 కోట్ల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రేపు ఈ సినిమా మలయాళం లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ‘లక్కీ భాస్కర్’ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని కేరళలో భారీ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. కిరణ్ సబ్బవరం కి ఇక్కడ అదృష్టం కలిసి వస్తే మరో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుంది. అప్పుడు మనం ఆశించిన 50 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్నట్టే, చూడాలి మరి అక్కడి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది.