India vs Australia : మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండవ అనధికారిక టెస్టులోనూ భారత ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా ఎదుట 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచితే.. కంగారు జట్టు దానిని నాలుగు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలో పూర్తి చేసింది.. సామ్ కొనాష్టస్ (73*) వెబ్ స్టర్ (46*) అదరగొట్టారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, తనుష్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.. మార్కస్ హారిస్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్ ను ప్రసిధ్ కృష్ణ సున్నా పరుగులకే వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో ముఖేష్, తనుష్ కూడా వికెట్ల వేటను ప్రారంభించడంతో ఆస్ట్రేలియా 73 పరుగులకే నాలుగు వికెట్లను నష్టపోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన వెబ్ స్టర్ సామ్ కు జత కలిశాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా ను గెలుపు తీరాలకు చేర్చారు. అయితే అంతకుముందు ఐదు వికెట్ల నష్టానికి 73 పరుగులతో ఆటను ప్రారంభించిన భారత్ జట్టు 229 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ధ్రువ్ జురెల్ 68 పరుగులు చేసి జట్టు పరువును కాస్తలో కాస్త కాపాడాడు. తనుష్ 44, ప్రసిధ్ కృష్ణ 29 పరుగులు చేసి భారత జట్టు పరువు పోకుండా కాపాడగలిగారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 161 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లోనూ ధ్రువ్ జురెల్ 80 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నీజర్ నాలుగు వికెట్లు సాధించాడు.. వెబ్ స్టర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 223 రన్స్ చేసింది.. ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్స్ సొంతం చేసుకున్నాడు. ముఖేష్, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సాధించారు. మార్కస్ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు.
విఫలమైన రాహుల్
అనధికారిక రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అయినప్పటికీ అతడు గొప్పగా ఆటతీరు ప్రదర్శించలేదు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో పది పరుగులు మాత్రమే చేశాడు. అతడు స్వల్పస్ స్కోర్ కే అవుట్ కావడం భారత జట్టు విజయం పై ప్రభావం చూపించింది. అనధికారిక టెస్టులలో భారత్ ఓడిపోవడంతో నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఆట తీరు ప్రదర్శిస్తే బలమైన ఆస్ట్రేలియాను ఎలా ఓడిస్తారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆట తీరు మార్చుకోకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి వెళ్లడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గత రెండు సీజన్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించిందని.. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని మరి కొంత మంది అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి ప్రవేశించాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.. ఒకవేళ 5-0 తేడాతో గెలిస్తే భారత జట్టు ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి ప్రవేశిస్తుంది.