https://oktelugu.com/

Actor Kiran Abbavaram : క.. మూవీతో కిరణ్ అబ్బవరం సక్సెస్ మాములుగా లేదుగా.. వారి నోటికి తాళం పడినట్లేనా..?

సినిమా పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే హీరోగా నిలదొక్కుకున్నాడు కిరణ్ అబ్బవరం.. తాజాగా క.. సినిమాతో ఆయన బంపర్ హిట్ ను సంపాదించుకున్నాడు. తనపై గతంలో ట్రోల్స్ చేసిన వారి నోళ్లు మూయించాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • Mahi
  • , Updated On : November 6, 2024 / 12:57 PM IST

    Kiran Abbavaram

    Follow us on

    Actor Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. క సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. డౌన్ టు ఎర్త్ పర్సన్ గా మరోసారి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఏపీలోని కడప జిల్లా రాయచోటి సమీపంలోని ఓ గ్రామం ఆయనది. ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో తాను పడిన కష్టాలు, తన తల్లి కష్టం గురించి ప్రత్యేకంగా అభిమానులతో పంచుకున్నాడు. ఇక తన తండ్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీలో ఆయన పాత్రను చూయించానని చెప్పుకొచ్చాడు. ఇటీవలే హీరోయిన్ రహస్య గోరక్ ను ఆయన వివాహం చేసుకున్నారు.. ఇదిలా ఉంచితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో రాణించిన నటుల్లో ఒకరిగా ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నిలిచారు. దీని వెనుక ఆయన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, ట్రోలింగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. కిరణ్ అసలు హీరో మెటీరియలే కాదని గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన స్పీచ్ తో బయటపడింది. తన కష్టాలను అభిమానులతో పంచుకున్నాడు. చిన్నతనంలో తన తల్లితో మాట్లాడాలంటే రెండు వారాలు వేచి చూడాల్సి వచ్చేదని, జేబులో చిల్లిగవ్వ లేకుండా సినిమాల్లో నటించేందుకు ఇష్టంతో వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన మాటలు, ఆయన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    క.. సినిమా కోసం కిరణ్ అబ్బవరం ఎంతో కష్టపడ్డారు. ఏడాది పాటు ఈ చిత్రం సక్సెస్ కోసం ఎంతో శ్రమించారు. దీపావళికి విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఘన విజయాన్ని సాధించింది. తనకు ఎలాంటి సినీనేపథ్యం లేకున్నా, తానెంటో నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. గతంలో తాను నటించిన రాజుగారు.. రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, రూల్స్ రంజన్, బాయ్స్ హాస్టల్ సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమాలో కిరణ్ ఆకట్టుకున్నారు.

    క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఆయన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గతంలో తాను తీసిన సినిమాలపై వచ్చిన ట్రోల్స్ విషయంలోఆయన గట్టి క్లాస్ పీకారు. అందరి నోళ్లు మూయించేలా క సినిమాతో సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇక రానున్న రోజుల్లో మరింత మంచి సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

    ఇక తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందని ఏ హీరో చెప్పలేడు. అయితే ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా,, తనని ట్రోలర్స్ ఆడి పోసుకున్నా ఎక్కడా కిరణ్ అబ్బవరం వెనక్కి తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకున్నా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు. క మూవీ ప్రస్తుతం కోట్లలో కలెక్షన్లు సంపాదిస్తున్నదంటే దాని వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.

    ఎలాంటి కాంట్రవర్సీలకు తావులేకుండా, సినిమాలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్న కిరణ్ అబ్బవరం యంగ్ జనరేషన్ హీరోలకు ఆదర్శమని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇప్పుడు కిరణ్ కు పెరిగిన అభిమానులు, ఫాలోయింగ్ మాములుగా లేదు. సో ఆల్ ది బెస్ట్ కిరణ్. మంచి సినిమాలతో మమ్మల్ని మరింతగా అలరిస్తావని ఆశిస్తున్నాం.