Kiraack Boys Khiladi Girls 2 Promo: జబర్దస్త్ షోతో పాప్యులర్ అయిన అనసూయ భరద్వాజ్ నటిగా రాణిస్తుంది. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ ఆమెకు దక్కుతున్నాయి. అనసూయకు మంచి డిమాండ్ ఉంది. ఆమె రోజుకు రూ. 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ యంగ్ హీరో మూవీలో నటిస్తున్న అనసూయ రోజుకు రూ. 3 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందని టాక్. సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక.. బుల్లితెరకు దూరమైంది అనసూయ. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసింది. ఒక దశలో ఇకపై టెలివిజన్ షోలు చేసేది లేదని కుండబద్దలు కొట్టింది.
కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 త్వరలో స్టార్ మా లో ప్రారంభం కానుంది. మరోవైపు నటిగా అనసూయ చేతి నిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఏదేమైనా ఆమె టెలివిజన్ షోలు చేయడం ఓ వర్గానికి సంతోషం కలిగిస్తుంది.
కానీ తన ప్రామిస్ బ్రేక్ చేస్తూ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మా లో ప్రసారమైన ఈ షోలో సీరియల్ నటులు, కమెడియన్స్ కంటెస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ అబ్బాయిలకు ప్రాతినిథ్యం వహించాడు. అమ్మయిలకు అనసూయ ప్రాతినిథ్యం వహించింది. తన మార్క్ వదలకుండా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లో సైతం అనసూయ గ్లామర్ షోకి తెరలేపింది. శేఖర్ మాస్టర్ షర్ట్ తీసేస్తే.. ఆమె కూడా పోటీగా జాకెట్ తీసేసి వార్తల్లో నిలిచింది. అనసూయ తీరుపై విమర్శలు తలెత్తినా పట్టించుకోలేదు.
కాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 కి రంగం సిద్ధమైంది. అనసూయ మరోసారి జడ్జిగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. శేఖర్ మాస్టర్ తో అమీ తుమీ అంటుంది అనసూయ. ప్రోమోలో శ్రీముఖిని కూడా మనం చూడొచ్చు. ఇక షోలో కంటెస్ట్ చేసే బుల్లితెర స్టార్స్ సైతం ప్రోమోలో భాగమయ్యారు. కాగా ఈ ప్రోమోలో అనసూయ నిండైన బట్టల్లో కనిపించడం విశేషం. ఇలాంటి ప్రోమోల్లో సాధారణంగా అనసూయ గ్లామర్ షోకి పూనుకుంటుంది. అందుకు భిన్నంగా ఆమె ఫుల్ లెంగ్త్ స్లీవ్ లెస్ టాప్ లో దర్శనం ఇచ్చింది.
ఈ క్రమంలో అనసూయ మారిపోయిందా? ఇకపై బుల్లితెర మీద గ్లామరస్ గా కనిపించదా? అనే సందేహాలు మొదలయ్యాయి.
Also Read: నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?