Kingdom Trailer Vijay Deverakonda: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) మూవీ ఈ నెల 31 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం లో ఎదో మంచి విషయమే ఉంది, ఒక కొత్త పాయింట్ తో తెరకెక్కించారు అనే నమ్మకాన్ని ఈ చిత్రం జనాల్లో కలిగించింది. ఇక ఓపెనింగ్స్ తిరుగు ఉండదు అనుకోవచ్చు. అయితే నిన్న ఈ ట్రైలర్ ని తిరుపతి లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎప్పుడూ తెలంగాణ యాసతో మాట్లాడే విజయ్ దేవరకొండ, ఈ ఈవెంట్ లో రాయలసీమ యాసలో మాట్లాడాడు.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
సినిమాలో ఆయన అదే యాసతో మాట్లాడాడో లేదో తెలియదు కానీ, తిరుపతి లో మాత్రం ఆయన ఆ యాసతో మాట్లాడడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘మీ అరుపులు, ఉత్సాహం చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉన్నాది. మీ అందరికీ ఒక మాట చెప్పాలా..నేను ఏనాడూ ఈ మాట ఎక్కడా చెప్పిందిలే..గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా రిలీజ్ గురించి ఆలోచిస్తుంటే నా తలకాయ్ తిరిగిపోతుంది. నా మనసులో గట్టిగా ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో, చాలా పెద్దోడ్ని అయ్యి పొడస్తాను సామీ, పొయ్యి టాప్ లోకి వెళ్లి కూర్చుంటా. ఎందుకంటే ప్రతీ సారీ లాగానే ప్రాణం పెట్టి గట్టిగా మనస్ఫూర్తిగా పనిచేశా, ఈసారి నా సినిమాని జాగ్రత్తగా చూసుకోవడానికి మంచి వాళ్ళు ఉన్నారు. మా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఉన్నాడు, మా పాలెగాడు అనిరుద్ పగలగొట్టినాడు, మా ఎడిటర్ నవీన్ నూలీ ఉన్నాడు, మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూస్ సంపినాడులే..మా పాప కొత్త పాప భాగ్యశ్రీ భొర్సే ఉన్నాది, అందరూ గట్టిగా ప్రాణం పెట్టి పనిచేసినారు. ఇక మిగిలింది రెండే, ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు, ఈ రెండు కానీ నాతోపాటు ఉంటే, వానెక్క ఏ నాకొడుకు మనల్ని ఆపేదేలే’ అంటూ విజయ్ దేవరకొండ చాలా పవర్ ఫుల్ గా మాట్లాడాడు.
విజయ్ దేవరకొండ ప్రసంగాలు మొదటి నుండి ఇలాగే చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి, ఒక్కోసారి వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం అలాంటిది జరగలేదు. కానీ మనల్ని ఎవరూ ఆపలేరు అని ఎవరిని ఉద్దేశించి విజయ్ దేవరకొండ ఈ మాట అన్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
