Kingdom Trailer Review: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు తిరుపతి లో భారీ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. సాయంత్రం సమయంలోనే విడుదల అవ్వాల్సిన ఈ ట్రైలర్, సాంకేతిక సమస్యల కారణంగా బాగా ఆలస్యంగా విడుదలైంది. కానీ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన మార్కు కి తగ్గ ప్రసంగాన్ని అందించి అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాటలను చూస్తుంటే ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ ని అందుకునేలా ఉన్నాడని అనిపిస్తుంది. ఇక ట్రైలర్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లను అన్నదమ్ములుగా చూపించారు. కానీ సత్యదేవ్ పెద్ద క్రిమినల్ అని, అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాడని హీరోయిన్ భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ తో చెప్పడంతో, ఆయన కోపం గా ఆమె పీక పెట్టుకోవడాన్ని చూస్తుంటే ఈ చిత్రం లో హీరో కి అన్న పాత్ర మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జైలు కి వెళ్లిన తర్వాత తన అన్నయ్య తో పోరాడే కొన్ని షాట్స్ ని చూపిస్తారు. అంటే తన అన్నయ్య తోనే యుద్ధం చేయబోతున్నాడా?, లేదా తన అన్నయ్య ని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించి ఎవరైనా జైలులో తోశారా?, ఇలాంటి ప్రశ్నలను ఆడియన్స్ మైండ్ లో నాటింది ఈ చిత్రం. ఓవరాల్ గా ఒక మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా అని ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా బలంగా పెట్టారు.
మధ్యలో జ్యోతిషులను కూడా చూపించడం చూస్తుంటే ఈ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యం లో తెరకెక్కిన సినిమానా?, ఈ యాంగిల్ ఏంటి కొత్తగా అని అనిపించక తప్పదు. ఓవరాల్ గా ఈ సినిమా అనేక లేయర్స్ మధ్య తెరకెక్కించిన సినిమా అని అర్థం అవుతుంది. కచ్చితంగా గట్టిగ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమాలాగానే అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కి తన కెరీర్ లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు తప్ప, మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు. టాక్సీ వాలా అనే సినిమా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఆయన గత చిత్రాలు మాత్రం మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. మరి ఈ సినిమా ఎంత మేరకు విజయ్ మార్కెట్ ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయన మీడియం రేంజ్ హీరోలలో టాప్ స్థానాన్ని ఆక్రమించొచ్చు.
