https://oktelugu.com/

Bangarraju Movie: కింగ్ నాగార్జున “బంగార్రాజు” రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. దీంతో అక్కినేని అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 07:31 PM IST
    Follow us on

    Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. దీంతో అక్కినేని అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ప్రకటించింది చిత్ర బృందం.

    తాజాగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, కృతి శెట్టి తోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ మేరకు బంగార్రాజు సినిమా జనవరి 14న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్న కానీ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని తెలిపింది మూవీ టీమ్.

    ఎప్పటి నుంచో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నాగార్జున చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తతో నాగ్ అభిమానుల్లో గ్ఫుల్ల్ జోష్ నెలకొంది. చూడాలి మరి ఏ మేరకు జనాలు థియేటర్స్‌కు వచ్చి సినిమాను చూస్తారో అని. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా పలు అనివార్య కారణాల వల్ల ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.