Kim Kardashian : ఈమధ్య కాలం లో పెళ్లి చేసుకునే సెలబ్రిటీలకంటే,విడాకులు తీసుకునే సెలబ్రిటీలు ఎక్కువ అయిపోయారు. పెద్ద కారణాలు కూడా అవసరం లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే చిన్న చిన్న గొడవలకు కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. పెళ్లి అనే వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే కొంతమంది హీరోలకు, హీరోయిన్లకు ఈ పెళ్లి అనే వ్యవస్థ పైనే నమ్మకం పోయింది. లివింగ్ రిలేషన్ షిప్ వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్నన్ని రోజులు కలిసి ఉంటారు, వర్కౌట్ అవ్వదు అని అర్తమైనప్పుడు విడిపోతారు, అలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం పొరపాటు పడి విడిపోతున్నారు అంటే అర్థముంది. పెళ్ళై ఏళ్ళు గడిచి పిల్లల్ని కన్న వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటే ఈ సమాజం అసలు ఎటు పోతుంది?, కేవలం విడాకులు తీసుకోవడం ఒక్కటే సమస్యకు పరిష్కారమా?

రీసెంట్ గానే ఒక హీరోయిన్ చాలా దరిద్రంగా కారణంతో విడాకులు తీసుకొని నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇలాంటి కారణం తో కూడా విడాకులు తీసుకుంటారా అని మనకు నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం కానీ పరిస్థితి అది. ఇంతకీ ఆ కారణం ఏంటో, అసలు పూర్తి కథ ఏంటో చూద్దాం పదండీ. ఆమె మరెవరో కాదు, అమెరికన్ సినీ నటీ, బిజినెస్ ఉమెన్, సోషల్ మీడియా టాప్ సెలబ్రిటీ అయినటువంటి కిమ్ కర్దాషియాన్. ఈమె కెనయే వెస్ట్ అనే ర్యాప్ గాయకుడిని ప్రేమించి పెళ్లాడింది. అయితే కొంతకాలం అతనితో కలిసి సంతోశావంతమైన జీవితం గడిపిన కిమ్, కొన్ని విబేధాల కారణంగా రీసెంట్ గానే విడిపోయింది. ఈమధ్య కాలం లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. ఆ కారణం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.image.png
ఆమె మాట్లాడుతూ ‘నేను అతనితో బాత్రూం లోకి వెళ్లినా, రెస్టారంట్ కి వెళ్లినా,హోటల్ కి వెళ్లినా ఇంకా ఎక్కడికైనా వెళ్లినా, కూర్చున్న చోటనే నిరపోతాడు. నేను మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు కూడా అతనికి నిద్ర వచ్చేస్తుంది. నా స్నేహితులు , సన్నిహితులు ఇంటికి వచ్చినప్పుడు అతను ఎదో జనరేటర్ రన్ చేస్తున్న శబ్దం తో గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. దీని వల్ల నాకు చాలా అసహ్యం వేసేది. ఇది భరించలేకనే అతనితో నేను విడాకులు తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంత చిన్న కారణానికి ఎవరైనా విడాకులు తీసుకుంటారో. అతను అలా ఉన్నప్పుడు ఎదో ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయి ఉండొచ్చు, డాక్టర్ కి చూపించి నయం చేసే ప్రయత్నం చేయకుండా ఇంత నిర్దాక్షిణంగా విడాకులు తీసుకుంటారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు.