Heroine : హీరోయిన్ కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఆమె పెళ్లాడారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కడమైంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్ళికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ ప్రముఖులను పిలవలేదు. వివాహం అనంతరం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పుడు బాలీవుడ్ స్టార్స్ హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
గత రెండేళ్లుగా సిద్దార్థ్ తో కియారా ప్రేమలో పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరు ఆ కథనాలను ఖండిస్తూ వస్తున్నారు. సడన్ పెళ్లి ప్రకటన చేశారు. వివాహం అనంతరం కూడా కియారా నటిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు తల్లి కావాలని ఉందన్నారు. అప్పుడు ఎలాంటి ఆంక్షలు ఉండవు. నచ్చిన ఫుడ్ హ్యాపీగా తినేయవచ్చు. అమ్మాయైనా అబ్బాయైనా పర్లేదు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు.. అని అన్నారు.
కియారా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అంత ఆశగా ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి ప్రొఫెషన్ కొంచెం పక్కన పెట్టని కొందరు సలహా ఇస్తున్నారు. కాగా కియారా అద్వానీ పెళ్లికి ముందే తల్లయ్యారని పుకార్లు వినిపించాయి. అందుకే హడావుడిగా పెళ్లి సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సందు ఇదే కామెంట్ చేశాడు.
అయితే కెరీర్ కోసం కియారా అబార్షన్ చేయించుకుందని ఉమర్ సందు దారుణ ఆరోపణ చేశారు. ఇక తెలుగులో కియారా గేమ్ ఛేంజర్ మూవీ చేస్తుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ హీరో. షూటింగ్ జరుపుకుంటుండగా వచ్చే ఏడాది విదుల్ కానుంది. రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ చేస్తున్నారు. గతంలో కియారా భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది.