Kiara Advani New Biopic Film 2025: మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో బయోపిక్స్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక లెజెండ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బయోపిక్స్ సక్సెస్ రేషియో నూటికి 90 శాతం ఉంటుంది. కానీ ఆ బయోపిక్ రోలర్ కోస్టర్ లాగా ఉంటేనే హిట్ అవుతుంది. ఒక మనిషి జీవితం ఎత్తుపల్లాలతో ముందుకు సాగుతుంది. ఎన్ని కష్టాలు ఉంటాయో, అన్ని సుఖాలు కూడా ఉంటాయి. రెండిటిని సమపాళ్లలో చూపించినప్పుడే ఒక ఆ బయోపిక్ కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుంది. లేకపోతే డిజాస్టర్ అవుతుంది. అందుకు ఉదాహరణలు మనం ఎన్నో చూసాము. అయితే ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) ఇప్పుడు లెజండరీ హీరోయిన్ మీనా కుమారి బయోపిక్ లో నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ‘బైజుబావ్రా’, ‘పాకీజా’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల ద్వారా మీనాకుమారి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
Also Read: Kiara Advani : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఈ చిత్రాన్ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా వెండితెర మీదకు తీసుకొని రాబోతున్నాడు. మీనాకుమారి పాత్రకు కేవలం కియారా అద్వానీ మాత్రమే న్యాయం చేయగలదని బలంగా నమ్ముతున్నారట. ఆమె పాత్రలోని పాత్రలోని భావోద్వేగం,గాంభీర్యం కేవలం కియారా అద్వానీ మాత్రమే పలికించగలదు అని నమ్ముతున్నారట. ఈ పాత్ర కోసం ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించారట. అందులో నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ కూడా ఉంది. కానీ కియారా అద్వానీ ని ఊహించుకున్న తర్వాత ఆ పాత్రలో మరో హీరోయిన్ ని ఊహించుకోవడం కష్టమైందట మేకర్స్ కి. అందుకే వెంటనే ఆమెని సంప్రదించడం, ఆమె కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కియారా అద్వానీ కి ఈమధ్య కాలం లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరకలేదు. పెళ్లి తర్వాత ఆమె నుండి విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు నటిగా తనను తానూ నిరూపించుకోవాలంటే ఈ సినిమా చేయాల్సిందే. అందుకే ఆమె ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన ‘వార్ 2’ , ‘టాక్సిక్’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.