Brahmanandam Funny Conversation With Suma: కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) కి టాలీవుడ్ లో ప్రతీ హీరో తో మంచి చనువు ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందరికీ ఆయన ఆప్తుడు గానే ఉంటూ ఇన్నేళ్ల నుండి నెట్టుకొస్తున్నాడు. ముఖ్యంగా చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం తో, మోహన్ బాబు(Manchu Mohan Babu) కుటుంబం తో ఆయనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. మోహన్ బాబు పై బ్రహ్మానందం వేసే పంచులు సోషల్ మీడియా లో ఇప్పటికీ బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. మీమర్స్ వీళ్ళ మధ్య జరిగే ఫన్నీ సంభాషణలను ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉంటారు. మరో మూడు రోజుల్లో మంచు విష్ణు హీరో గా నటించిన ‘కన్నప్ప’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం ఫుల్ బిజీ గా గడుపుతుంది. రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా పూర్తి చేశారు మేకర్స్.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ, బ్రహ్మానందం మధ్య జరిగిన ఒక ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫన్నీ సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా యాంకర్ సుమ బ్రహ్మానందం వద్దకు వచ్చి ‘ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాలలో మిమ్మల్ని హీరో గా పెట్టి సినిమా చేయమని కోరితే ఈ మూడు సినిమాల్లో నుండి ఏ సినిమాని ఎంచుకుంటారు. A) అల్లుడు గారు,B) పెద్దరాయుడు,C)అసెంబ్లీ రౌడీ’ అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మానందం ‘అసెంబ్లీ రౌడీ’ అని సమాధానం ఇస్తాడు. ఎందుకు అని సుమ అడగ్గా, దానికి బ్రహ్మానందం బదులిస్తూ ‘ఎప్పుడో చేసేవాడిని..అసలు అసెంబ్లీ రౌడీ కి ముందు నన్నే అడిగారు. స్టోరీ వీక్ గా ఉందని రిజెక్ట్ చేశాను. కానీ మోహన్ బాబు మా ఇంటికి వచ్చి దయచేసి ఈ సినిమాని నేను చేసుకుంటాను, ఆ అవకాశం కల్పించింది అని ప్రాధేయ పడ్డాడు. పోనిలే పాపం అని ఇచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
బ్రహ్మానందం మాట్లాడిన ఈ ఫన్నీ మాటలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు సినిమా విడుదల సందర్భంగా మరోసారి ఈ వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ‘కన్నప్ప’ చిత్రం లో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. గుండె ఆపరేషన్ తర్వాత కొన్నాళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బ్రహ్మానందం ఈమధ్య కాలం లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ మాత్రం ఈమధ్య కాలంలో చేయలేదు. అంతకు ముందు ‘రంగ మార్తాండ’ అనే చిత్రం లో ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేశాడు కానీ, ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ‘కన్నప్ప’ చిత్రం లో మరోసారి ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేశాడు. ఈ క్యారక్టర్ అయినా రీ ఎంట్రీ తర్వాత బ్రహ్మానందం కి మంచి పేరు తీసుకొస్తుందో లేదో చూడాలి.