Naga Chaitanya: నాగ చైతన్య-సమంత విడిపోయి రెండేళ్లకు పైగా అవుతుంది. అయినా ఒకరంటే మరొకరికి ద్వేషం, అసహనం మాత్రం కొనసాగుతున్నాయనిపిస్తుంది. ఇటీవల ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ వేదికపై మజిలీ మూవీలోని ‘ప్రియతమా ప్రియతమా’ సాంగ్ పాడుతుంటే సమంత ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆ సాంగ్ ముగిసే వరకు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా పెట్టింది. నాగ చైతన్యతో తాను నటించిన ఆ పాట పాడటం ఆమె అసలు ఇష్టపడలేదన్నట్లు ఆమె ఫీలింగ్ ఉంది.
తాజాగా ఇలాంటి ఘటన నాగ చైతన్యకు ఎదురైందట. ఆయన సినిమా చూస్తున్న థియేటర్లో ఖుషి ట్రైలర్ ప్రదర్శించారట. దాంతో ఆయన చిరాగ్గా లేచి వెళ్లిపోయారట. బాయ్స్ హాస్టల్ పేరుతో ఇటీవల ఓ మూవీ విడుదలైంది. ఈ మూవీ టీమ్ సెలెబ్రిటీస్ కి స్పెషల్ షోలు వేశారు. బాయ్స్ హాస్టల్ ప్రీమియర్స్ కి నాగ చైతన్య హాజరయ్యాడట. ఇంటర్వెల్ లో ఖుషి చిత్ర ట్రైలర్ రావడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడట. థియేటర్ నుండి కోపంగా బయటకు వెళ్ళిపోయాడట.
ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయాన్ని నాగ చైతన్య ఖండించినట్లు సమాచారం, అవన్నీ పుకార్లే అని ఆయన వెల్లడించారట. ఖుషి మూవీలో సమంత-విజయ్ దేవరకొండ ఒకింత హద్దులు దాటేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లో మైమరచి నటించారు. ఇక ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ హైలెట్ అవుతుంది. ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ లో ఇద్దరూ రొమాన్స్ చేశాడు. చొక్కా విప్పేసిన విజయ్ దేవరకొండ సమంతను ఎత్తుకుని గాల్లో తిప్పాడు.
అలాగే సమంతకు అర్ధరాత్రి కాల్ చేసి ఐ మిస్ యూ అని చెప్పాడు. సమంత-విజయ్ దేవరకొండ వీడియో కాల్ వైరల్ అయ్యింది. దీనిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. మరీ ఛీప్ పబ్లిసిటీ అని ఏకిపారేశారు. ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఖుషి మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.