Khushi Re Release Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి చిత్రం మరోసారి రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా రాబొయ్యే రీ రిలీజ్ చిత్రాలకు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 3 కోట్ల 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..రెండవ రోజు కూడా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఈ చిత్రం..అలా కేవలం రెండు రోజుల్లోనే 5 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇక ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరోసారి నిరూపించింది అమెరికా కలెక్షన్స్.
అమెరికాలో అత్యధిక వసూళ్లను ఇచ్చే సినీ మార్క్, రెగల్ మరియు యాపిల్ సినిమాస్ వంటి భారీ మల్టీప్లెక్స్ లు రీ రిలీజ్ లకు థియేటర్స్ ఇక నుండి ఇవ్వబోమని అధికారిక ప్రకటన చేసారు..ఎందుకంటే ఫ్యాన్స్ ఎగురవేస్తున్న పేపర్స్ మరియు థియేటర్స్ డ్యామేజ్ వంటివి చేస్తుండడం వల్ల వాళ్లకి భారీగా నష్టాలు వాటిల్లుతుందట..అందుకే ఖుషి సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు..దీనితో డిస్ట్రిబ్యూటర్ స్వతంత్ర థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు..అక్కడ కొత్త సినిమాలకు మొదటిరోజు టికెట్స్ అమ్ముడుపోవడమే చాలా కష్టం, అలాంటిది ఖుషి చిత్రానికి టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.

మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి అక్కడ 20 వేల డాలర్లు వచ్చాయి..మిగిలిన హీరోలకు ఆ థియేటర్స్ లో సినిమా విడుదల చేస్తే కనీసం మూడు వేల డాలర్స్ కూడా వచ్చేవి కాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..జనవరి 7 వ తేదీన మహేష్ బాబు హీరో గా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవుతుంది..ఈ చిత్రం ఆ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.