ఒకప్పటి భారీ హాట్ బ్యూటీ, ఇప్పటి రాజకీయ నాయకురాలు ఖుష్బూకి ఒక సమస్య వచ్చింది. నిత్యం ట్విట్టర్ లో ప్రతిపక్ష నాయకులను తిట్టడంలో బిజీగా ఉండే ఖుష్బూ, ప్రస్తుతం ఆమె ఆ తిట్టే అవకాశాన్ని కోల్పోయిందట. కారణం, ఖుష్బూ ట్విటర్ ఖాతా హ్యాకింగ్ గురి అయింది. అదేంటి ? గతంలో కూడా ఖుష్బూ ఎకౌంట్ హ్యాకింగ్ అయింది కదా. అంటే మరోసారి కూడా అలాగే అయిందా ?
అసలు ఎవరు హ్యాకింగ్ చేస్తాడా అని ఖుష్బూ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుందా ఏమిటి ? ఏమిటో ఈ ఖుష్బూ ? పాపం ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కాస్త అదుపు తప్పింది. టీవీ షోలలో కూడా విపరీతమైన కోపాన్ని చూపిస్తూ మధ్యలో అడ్డు వచ్చిన వాళ్ళ పై తనదైన శైలిలో విరుచుకు పడుతుంది. సరే ఇక తన ట్విట్టర్ విషయాన్ని ఖుష్బూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది.
ఈ సందర్భంగా ఖుష్బూ మెసేజ్ పెడుతూ.. ‘నా అకౌంట్ మళ్లీ హ్యాక్ అయింది. ట్విటర్ నుంచి నాకు అదే సమాచారం వచ్చింది. నేను నిన్నటి నుంచి మూడు ప్లేస్ ల్లో మూడు సార్లు లాగిన్ అయినా ఇదే పరిస్థితి. 48 గంటల నుంచి నా పాస్వర్డ్ మార్చలేదు. అయితే, ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం కూడా నాకు ఎలాంటి సాయం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయినా, నా ఎకౌంట్స్ నే ఎందుకు హ్యాక్ చేస్తున్నారు ? నా చుట్టూ అసలేం జరుగుతుందో నాకు తెలియడం లేదు. మరోపక్క నా ఎకౌంట్ ను సస్పెండ్ చేసినట్లు ట్విటర్ మెసేజ్ పాస్ చేసింది. ఈ విషయంలో నాకు ఎవరైనా సాయం చేసి ఈ సమస్యను పరిష్కరిస్తే.. వారికి నేను ఫస్ట్ థాంక్స్ చెబుతాను’ అంటూ చివర్లో తాను రాజకీయ నాయకురాలు అని ఆమెకు గుర్తుకు వచ్చినట్టు ఉంది. అందుకే ‘ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి’ ఒక రొటీన్ డైలాగ్ పడేసింది. ఏమిటో ఖుష్బూ పాపం.