ఆ కామెంట్స్ కి తోడు సినిమాలు చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే, సడెన్ గా తన ఫిజిక్ ను పూర్తిగా మార్చుకోవాలని మూడు నెలలు క్రితం నిర్ణయించుకుంది. సన్నబడటానికి బాగా హార్డ్ వర్క్ చేసింది. మొత్తానికి ఇప్పుడు సన్నపడింది. తన కొత్త లుక్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. పైగా తన లేటెస్ట్ పిక్ పోస్ట్ చేస్తూ.. ‘కష్టం.. ఫలితాలని ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది’ అనే ఒక క్యాప్షన్ ను కూడా పోస్ట్ చేసింది.
ఇక ప్రస్తుతం ఖుష్బూ షేర్ చేసిన ఈ ఫోటోకు తెగ లైకులు అండ్ షేర్ లు వస్తున్నాయి. అయితే, ఈ కొత్త లుక్ కారణంగా ఖుష్బూ పేస్ లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. బుగ్గలు తగ్గే సరికి లైట్ గా ముడతలు పడింది చర్మం. అయినా గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ, ఎలాంటి లుక్ లోనైనా అందంగానే ఉంటుంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ఖుష్బూ ‘అన్నాత్తే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో కూడా రజనీ – ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే, ఈ సినిమా పై కూడా అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.