Khaleja Re-release Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిల్చిన ‘ఖలేజా'(Khaleja Re Release) చిత్రాన్ని ఇటీవలే గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి రిలీజ్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండవ రిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. గతం లో ఇలాంటి అరుదైన ఘటన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రం విషయం లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఖలేజా విషయంలోనే రిపీట్ అయ్యింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజున కోటి 20 లక్షలు, మూడవ రోజున 78 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
Also Read: భైరవం’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యేది ఎప్పుడు?
కానీ ఓవర్సీస్ లో మాత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. అయితే నాల్గవ రోజున సోమవారం, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడంతో ఈ చిత్రానికి నాల్గవ రోజున 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 7.5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈరోజుటి నుండి గ్రాస్ వసూళ్లు రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే రీ రిలీజ్ చిత్రాలకు వీకెండ్ ని దాటి భారీ గ్రాస్ వసూళ్లు రావడం వంటివి ఇప్పటి వరకు జరగలేదు.
కాబట్టి లాంగ్ రన్ 7 కోట్ల 50 లక్షల రూపాయలకే లాక్ చేసుకున్నట్టు సమాచారం. రీ రిలీజ్ చిత్రాల్లో ఇది ఆల్ టైం టాప్ 4 అని చెప్పొచ్చు. మొదటి స్థానం లో దాదాపుగా 9 కోట్ల రూపాయలతో మురారి చిత్రం కొనసాగుతుండగా, రెండవ స్థానం లో 8 కోట్ల రూపాయలతో ‘గబ్బర్ సింగ్’ చిత్రం కొనసాగుతుంది. ఇక మూడవ స్థానం లో 7 కోట్ల 70 లక్షల రూపాయలతో ఖుషి చిత్రం కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో ఖలేజా చిత్రం నిల్చింది. ఇప్పుడు కాకుండా మహేష్ బాబు పుట్టినరోజున ఈ సినిమా విడుదల అయ్యుంటే కచ్చితంగా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పి ఉండేదని అంటున్నారు. ఈసారి మహేష్ పుట్టినరోజు కి అతడు చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయాలనీ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ‘ఖలేజా’ కంటే రెండింతలు ఎక్కువ వసూలు చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.