Khadgam Movie Unknown Facts: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అనేది అంత ఆషామాషీ వహారమైతే కాదు. ఒక సినిమాతో సక్సెస్ వచ్చినంత మాత్రాన ఇక్కడ టాప్ రేంజ్ కు వెళ్ళిపోతామనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ప్రతిసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వరుస సక్సెస్ లను సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ రోజుల పాటు తమ మనుగడ అనేది సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇదిలా ఉంటే ఇకమీదట రాబోయే సినిమాలతో చాలామంది హీరోలు మంచి విజయాలను సాధించాలని చూస్తున్నారు… ఇక క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ వంశీ(Krishna Vamshi) చేసిన ఖడ్గం (Khadgam) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. హిందూ ముస్లింల గురించి పాజిటివ్ గా చెబుతూ తెరకెక్కించిన ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసికల్ సినిమాగా మిగిలిపోయిందనే చెప్పాలి… అయితే ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ఇక ఆ సినిమాలో నటిస్తూనే డైలాగ్ చెప్పడంలో ఇబ్బంది పడుతుంటే తన పక్కనే ఉన్న రవితేజ ఆ డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పి పక్కకెళ్ళిపోతాడు. నిజానికి పృథ్వి క్యారెక్టర్ వల్ల అక్కడున్న డైరెక్టర్ గాని, సోనియా యూనిట్ గాని అందరూ చాలా ఇబ్బందిపడిపోతారు. ఇక అందులో నుంచే రవితేజ (Raviteja) బయటకు వచ్చి చెప్పాల్సిన డైలాగ్ చెప్పి అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుకుంటాడు.
అయితే ఈ సీను కృష్ణవంశీ ఏ ఉద్దేశ్యంతో రాసాడో తెలీదు కానీ దాసరి నారాయణరావు (Dasara Narayana) తన కెరియర్ లో ఈ లాంటి సిచువేషన్ ని ఎదుర్కొన్నాడని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. సీనియర్ నటుడు అయిన బాలకృష్ణ చెప్పాల్సిన డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడిపోతుంటే పక్కనే ఉన్న దాసరి నారాయణరావు ఆ డైలాగు చెప్పారట.
Also Read: హీరో ఎవరైనా, జానర్ ఏదైనా త్రివిక్రమ్ సినిమాలో ఈ సీన్స్ ఉండాల్సిందేనా..? వైరల్ వీడియో…
దాంతో అప్పట్లో కమెడియన్ గా ఉన్న బాలకృష్ణ దాసరి నారాయణరావు మీద కొంతవరకు కోపాన్ని ప్రదర్శించినట్టుగా కూడా ఆయన తెలియజేశాడు. బాలకృష్ణ అంటే నందమూరి బాలకృష్ణ కాదు అప్పట్లో బాలకృష్ణ అనే ఒక నటుడు ఉండేవారు… మొత్తానికైతే ఆ సినిమాలో దాసరి నారాయణరావు ఒక అద్భుతమైన పాత్రని చేజిక్కించుకొని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారట.
దాసరి నారాయణరావు తన ఎంటైర్ కెరియర్ లో 150 సినిమాలను డైరెక్ట్ చేశారనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన దర్శకుడు గానే కాకుండా మాటల రచయితగా అలాగే లిరిక్ రైటర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక నటుడిగా కూడా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్న దాసరి నారాయణరావు సినిమా ఖ్యాతిని పెంచాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… గతంలో ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది…
