https://oktelugu.com/

KGF 2 Movie Trailer: సర్‌ ప్రైజ్ కి ‘కేజీఎఫ్ 2’ రెడీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు

KGF 2 Movie Trailer:  ‘కేజీఎఫ్ 2’.. యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా సినిమా. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ను నేడు వెల్లడించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాలంటూ నాలుగు రోజుల కిందట ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. సాంగ్ లేదా ట్రైలర్ లేదా ఇంకేదైనా సర్‌ప్రైజ్ కావాలా? అని […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2022 / 12:49 PM IST
    Follow us on

    KGF 2 Movie Trailer:  ‘కేజీఎఫ్ 2’.. యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా సినిమా. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ను నేడు వెల్లడించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాలంటూ నాలుగు రోజుల కిందట ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. సాంగ్ లేదా ట్రైలర్ లేదా ఇంకేదైనా సర్‌ప్రైజ్ కావాలా? అని ఆప్షన్లు ఇచ్చారు.

    KGF 2 Movie Trailer

    దీంతో ఆ మూడింట్లో ఏది విడుదల చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా గురించి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట. ఆమెది స్పై లాంటి పాత్ర. ఇక దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది.

    Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

    కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు. అన్నట్టు కెజిఎఫ్ 2 గత ఏడాది అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది.

    లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలస్యం అవ్వడం, ఆ తరువాత ఈ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తే.. కరోనా సెకెండ్ వేవ్ వచ్చి రిలీజ్ ను మళ్ళీ ఆపడంతో.. మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది.

    KGF 2 Movie Trailer

    కానీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి.

    ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించబోతుందట.

    Also Read: అఖిల్, స్రవంతిలు ముమైత్ ఖాన్ గురించి ఏం మాట్లాడారో తెలుసా?

    Tags