Peddi Overseas Rights: సరిగ్గా మరో 3 వారాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని పాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో పేలింది , ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట కేవలం ఇండియన్స్ ని మాత్రమే కాదు , ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్ ని కూడా ఉర్రూతలూ ఊహించింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదలైన ‘పహిల్వాన్’ గ్లింప్స్ వీడియో అయితే నేషనల్ లెవెల్ లో సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలింది.
ఇలా ఒక్కటా , రెండా , ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ విడుదలైనా సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేది. అయితే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ మొత్తాన్ని ‘హోమబుల్ ఫిలిమ్స్’ సొంతం చేసుకుంది. కేజీఎఫ్ , సలార్, కాంతారా సిరీస్ ఇలా ఎన్నో పాన్ ఇండియన్ అద్భుతాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం తో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి అడుగుపెట్టింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన థియేట్రికల్ రైట్స్ ని కూడా ఈ సంస్థనే సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ కూడా బయటకు రానుంది.
అయితే హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ అంత తేలికగా ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రాదు. సినిమాలో కంటెంట్ వేరే లెవెల్ లో ఉంటేనే , వాళ్ళు ఒక చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి చాలు , ఈ సినిమాని ఎందుకు కొనాలి అని చెప్పడానికి, అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రషస్ ని హోమబుల్ ఫిలిమ్స్ సంస్థకు చూపించారట, వాళ్లకు పిచ్చి పిచ్చి గా నచ్చడం తో, వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్, మేకర్స్ కోరినంత ఇచ్చి సొంతం చేసుకున్నారట. ఇక బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.