https://oktelugu.com/

ప్రభాస్ ను ఫాలో అవుతున్న ‘కేజీఎఫ్’ హీరో.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కేజీఎఫ్ చిత్రం కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా ‘కేజీఎఫ్-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా? కన్నడ హీరో యశ్ ‘కేజీఎఫ్’లో హీరోగా నటించాడు. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’పై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 12:49 PM IST
    Follow us on


    కేజీఎఫ్ చిత్రం కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా ‘కేజీఎఫ్-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

    కన్నడ హీరో యశ్ ‘కేజీఎఫ్’లో హీరోగా నటించాడు. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’పై అంచనాలు పెరిగాయి. ‘బాహుబలి’ సీరిసుల మాదిరిగానే ‘కేజీఎఫ్’ కూడా విజయం సాధిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. దీంతోనే ఓటీటీలో ఈ సినిమాకు వంద కోట్ల ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ మొగ్గుచూపింది.

    ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘కేజీఎఫ్-2’ దాదాపు 500కోట్ల మేర వసూలు చేస్తుందని చిత్రయూనిట్ అంచనా వేస్తోంది. ఇక ఈ మూవీ కోసం యశ్ కు అదిరిపోయే రెమ్యూనేషన్ దక్కనుందనే టాక్ విన్పిస్తోంది. కేజీఎఫ్-1కు 15కోట్లలోపు రెమ్యూనరేషన్ తీసుకున్న యశ్ సెకండ్ పార్ట్ లో షేర్ తీసుకున్నాడట. దీంతో యశ్ కు దాదాపు 30కోట్ల మేర షేర్ దక్కనున్నట్లు తెలుస్తోంది. సినిమా భారీ కలెక్షన్లు సాధించే యశ్ కు మరింత లాభం రానుందనే టాక్ విన్పిస్తోంది.

    ‘బాహుబలి’తో ప్రభాస్ వరల్డ్ వైడ్ పాపులర్ కాగా యశ్ కూడా ‘కేజీఎఫ్’తో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలతో ఎవరికీ అందనంత రేంజులో ప్రభాస్ దూసుకెళుతున్నాడు. ప్రభాస్ తరహానే యశ్ కూడా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ ను సద్వినియోగం చేసుకునేందుకు యత్నిస్తున్నాడు.

    Also Read: థియేటర్ల ఓపెనింగ్.. కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా?

    యశ్ తో తెలుగు, తమిళ నిర్మాతల పాన్ ఇండియా మూవీలు తెరకెక్కించేందుకు యత్నిస్తున్నారు. యశ్ తన మరింత పెంచుకునేందుకు పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మాదిరిగా యశ్ కూడా పాన్ ఇండియా హీరోగా సక్సస్ సాధిస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!