Yash and Kiara Advani : ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ప్రముఖ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ కి ఇండియా వైడ్ గా యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. కానీ ఈమె అందానికి కోట్లాది మంది యూత్ ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియా లో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు లో ఈమె ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈమె రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం ఈమె ‘కేజీఎఫ్’ సిరీస్ హీరో, రాకింగ్ స్టార్ యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమెది నటనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఆ పాత్రని సరిగా చేయడం లేదని హీరో యాష్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. గత నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గానే ఆ నెల రోజుల షూటింగ్ కి సంబంధించిన రషెస్ ని చూసిన యాష్, సినిమా బాగారాలేదని మండిపడినట్టు శాండిల్ వుడ్ లో ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలన్నీ పక్కన పెట్టి, మళ్ళీ కొత్తగా రీ షూట్ చేయాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడట యాష్. అంతే కాదు హీరోయిన్ కియారా అద్వానీ నటన ఏమాత్రం బాగాలేదని, ఆమెని ఈ చిత్రం నుండి తప్పించి మరో హీరోయిన్ ని తీసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తుంది.
పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ ఇమేజి ని సంపాదించుకున్న కియారా అద్వానీ కి ఇది ఘోరమైన అవమానమే అని చెప్పొచ్చు. కియారా అద్వానీ కేవలం అందంతోనే కాదు, నటనతో కూడా తనని తానూ నిరూపించుకున్న నటి. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఈమె హీరోయిన్ గా నటించింది. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయిన్ కంటే, కియారా అద్వానీ వంద రెట్లు అద్భుతంగా నటించింది. అదే విధంగా బాలీవుడ్ లో ఆమె ఎన్నో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటించింది. ‘గోవిందా నామ్ తేరా’ అనే చిత్రంలో నెగటివ్ రోల్ లో కూడా అద్భుతంగా మెప్పించి బాలీవుడ్ ఆడియన్స్ నుండి మార్కులు కొట్టేసింది. అలాంటి కియారా అద్వానీ నటనపై యాష్ అసంతృప్తిగా ఉండడం గమనార్హం. చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో.