Prabhas : ఇండియాలో ఉన్న టాప్ 3 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే, అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన తోటి స్టార్ హీరోలతో పోలిస్తే శరవేగంగా సినిమాలు చేస్తూ, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. తన సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుతూ ఎన్నో వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే, వాటిల్లో ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలు కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. అవి డిజాస్టర్ సినిమాలు అయినప్పటికీ, తన తోటి హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా గ్రాస్ వసూళ్లను రాబట్టి తన స్టామినా ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు ప్రభాస్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఆయన 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.
ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయం లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాతే. అలాంటి ప్రభాస్ కి ఒకప్పుడు అప్పులు ఉండేవి అంటే మీరు నమ్ముతారా?, ప్రభాస్ కొత్తగా బాహుబలి సినిమాతో స్టార్ అయిపోలేదు. అంతకు ముందు నుండే పెద్ద స్టార్ హీరో. ఒక్కో సినిమాకి అప్పట్లో 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని ఆదుకునేవాడు. అలాంటి ప్రభాస్ కి అప్పులేంటి?, సొల్లు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ నిజాన్ని చెప్తుంది మేము కాదు, స్వయంగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అవి బాహుబలి సినిమాని చేస్తున్నాం అంటూ డైరెక్టర్ రాజమౌళి ప్రకటించిన రోజులు. రాజమౌళి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు.
ఆ సమయంలో ప్రభాస్ రాజమౌళి సతీమణి రమా రాజమౌళి వద్దకు వచ్చి. నాకు చాలా అప్పులు ఉన్నాయి, మా స్నేహితులు మిర్చి సినిమా చేద్దాం అనుకుంటున్నారు, స్టోరీ బాగా కుదిరింది, చేసుకోవచ్చా? అని అడిగాడట. దానికి రమా రాజమౌళి సమాధానం చెప్తూ ‘రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేసి సెట్స్ మీదకు వెళ్ళేలోపు చాలా సమయం పడుతుంది కదా, నువ్వు చేసుకొనిరా, మరేం పర్వాలేదు’ అని చెప్పిందట. ఆ తర్వాత రాజమౌళి ని కూడా ఒక మాట అడిగి, ఈ చిత్రాన్ని చేసినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమాని టీవీ టెలికాస్ట్ చేసినప్పుడు డీసెంట్ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చేయమని ప్రభాస్ ని అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఆ రేంజ్ దాటి హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోవడంతో, మిర్చి కాలం నాటి ప్రభాస్ ని మిస్ అవుతున్నారు ఫ్యాన్స్.