https://oktelugu.com/

అరె.. అయోమయంలో ‘కేజిఎఫ్ 2’.. దారేది ?

భారీ సినిమాలకు భారీ తనం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విడుదల తేదీ అనేది అంతకంటే ముఖ్యం. కరెక్ట్ టైంలో రిలీజ్ అయితేనే భారీ వసూళ్లు వస్తాయి. వందల కోట్ల బిజినెస్ కి న్యాయం జరగాలంటే… సీజన్ కూడా చాల ఇంపార్టెంట్. కానీ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’ అయోమయంలో పడిపోయింది. ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కానీ రిలీజ్ డేట్ మిస్ అయిపోయింది. నిజానికి ఈ సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : May 1, 2021 3:12 pm
    Follow us on

    KGF 2భారీ సినిమాలకు భారీ తనం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విడుదల తేదీ అనేది అంతకంటే ముఖ్యం. కరెక్ట్ టైంలో రిలీజ్ అయితేనే భారీ వసూళ్లు వస్తాయి. వందల కోట్ల బిజినెస్ కి న్యాయం జరగాలంటే… సీజన్ కూడా చాల ఇంపార్టెంట్. కానీ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’ అయోమయంలో పడిపోయింది. ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కానీ రిలీజ్ డేట్ మిస్ అయిపోయింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ విషయంలో టీమ్ చాల కష్టపడింది.

    అందర్నీ మ్యానేజ్ చేసుకుని ఎలాంటి పోటీ లేని రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుంది. కానీ కరోనా దెబ్బకు అంతా చిందరవందర అయిపోయింది. సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్న ‘కేజిఎఫ్ 2’కి, ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ కనిపించడం లేదు. మరోపక్క ఈ సినిమాకి భారీ పెట్టుబఢి పెట్టారు. అంతకుమించి ఈ సినిమాని భారీగా అమ్ముతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కి ముందే కేజిఎఫ్ 2 సినిమా కోసం ఎన్నడూ లేనిది తెలుగులో కూడా గట్టిగా పోటీ పడ్డాయి పలు సంస్థలు.

    కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా కేజిఎప్ 2కి మరో మంచి రిలీజ్ డేట్ దొరికేలా లేదు. దసరాకి తెలుగు భారీ సినిమాలే క్యూలో ఉన్నాయి. కాబట్టి, సోలో రిలీజ్ డేట్ అసాధ్యం. మరి పోటీలో తెలుగు స్టార్ హీరోలతో పోటీ పడి రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ అసాధ్యం. కాబట్టి ఎటు చూసినా కెజిఎఫ్ 2కి అసలు కాలం కలిసి వచ్చేలా లేదు. ఏది ఏమైనా 2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందింది.

    అందుకే కెజిఎఫ్ 2కి అంతకు మించిన ఆదరణ ప్రేక్షకులలో నెలకొంది. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు. అన్నిటికిమించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది.