https://oktelugu.com/

KGF 2: కేజీఎఫ్ సంచలనం.. ఆర్ఆర్ఆర్.. బాహుబలి రికార్డులు బ్రేక్..!

KGF Chapter 2 Sensation Record: కన్నడ రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్’. మొదటి పార్ట్ తోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగారాసిన ‘కేజీఎఫ్’ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్-2’ పేరుతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజే ‘కేజీఎఫ్ చాప్టర్-2’ మూవీ బుకింగ్స్ లో ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాలను బ్రేక్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. కేజీఎఫ్ పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అభిమానులు భారీ అంచనాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2022 / 11:32 AM IST
    Follow us on

    KGF Chapter 2 Sensation Record: కన్నడ రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్’. మొదటి పార్ట్ తోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగారాసిన ‘కేజీఎఫ్’ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్-2’ పేరుతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజే ‘కేజీఎఫ్ చాప్టర్-2’ మూవీ బుకింగ్స్ లో ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాలను బ్రేక్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది.

    KGF 2 Breaks RRR Records

    కేజీఎఫ్ పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్-2’ కథను తీర్చిదిద్దారు. మొదటి పార్ట్ లో కేజీఎఫ్ రాఖీబాయ్ సొంతమైనట్లు చూపించారు. అయితే సెకండ్ పార్ట్ లో అధీరా ఎంట్రీతో ‘కేజీఎఫ్ చాప్టర్-2’ మొదలు అవుతుంది.

    ఈ సినిమాలో రాఖీఖాయ్(యశ్), అధీరా(సంజయ్ దత్) పోరాటల సన్నివేశాలను దర్శకుడు బాగా ఎలివేట్ చేసి చూపించారు. యశ్ కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. రవీనా టండన్ కీలక పాత్రలో నటించగా మిగిలిన నటీనటులు తమ పాత్రమేర న్యాయం చేశారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో హొంబళే ఫిల్మ్స్ సంస్థ  నిర్మించగా.. రవి బస్రూర్ అదిరిపోయే బీజీఎం అందించాడు.

    ప్రపంచ వ్యాప్తంగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నేడు పదివేల థియేటర్లలో విడుదలైంది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. రిలీజుకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా కొన్ని గంటల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ సినిమాకు దాదాపు రూ. 80.30 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

    దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు బాహుబలి 80కోట్లు, ఆర్ఆర్ఆర్ 58కోట్లు, హలీవుడ్ మూవీ అవేంజర్స్ ఎండ్ గేమ్ 60 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ తో వసూళ్లను రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్ 2’ ఎంట్రీతో ఈ రికార్డులన్నీ కూడా బ్రేక్ అయ్యారు. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 80.30కోట్ల వసూళ్లను రాబట్టి నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా రికార్డును నెలకొల్పింది.