https://oktelugu.com/

SIR Movie: ధనుష్ ‘సార్’ మూవీ నుంచి కీలక అప్డేట్..!

SIR Movie: స్టార్ హీరోలంతా ఇటీవల కాలంలో అయితే ప్యాన్ ఇండియా లేదంటే బై లాంగ్వేజేస్ మూవీలు చేస్తున్నారు. తెలుగులో స్టార్డమ్ ఉన్న హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతుండగా తమిళ హీరోలు మాత్రం మల్టీ లాంగ్వేజ్ సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటూ.. కలెక్షన్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమిళంలోని స్టార్ హీరోలంతా దాదాపుగా వాళ్ల సినిమాలను కోలీవుడ్ తోపాటు తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళంలో హిట్టయిన తమ […]

Written By: , Updated On : January 7, 2022 / 12:15 PM IST
Follow us on

SIR Movie: స్టార్ హీరోలంతా ఇటీవల కాలంలో అయితే ప్యాన్ ఇండియా లేదంటే బై లాంగ్వేజేస్ మూవీలు చేస్తున్నారు. తెలుగులో స్టార్డమ్ ఉన్న హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతుండగా తమిళ హీరోలు మాత్రం మల్టీ లాంగ్వేజ్ సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటూ.. కలెక్షన్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Sir Movie

తమిళంలోని స్టార్ హీరోలంతా దాదాపుగా వాళ్ల సినిమాలను కోలీవుడ్ తోపాటు తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళంలో హిట్టయిన తమ సినిమాలను టాలీవుడ్లో రిలీజ్ చేస్తుండటంతో ఇక్కడ కూడా వారికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ మొదలుకొని సూర్య, అజిత్, విజయ్, ధనుష్ వంటి హీరోలకు టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది.

‘రఘువరన్ బీటెక్’ మూవీతో హీరో ధనుష్ కు తెలుగులో డిమాండ్ ఏర్పడింది. ఈక్రమంలోనే ధనుష్ తమిళ్ తోపాటు తెలుగు సినిమాలపై దృష్టిసారిస్తున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ‘సార్’ అనే మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కుతోంది. రఘువరన్ బీటెక్ మూవీ తరహాలోనే ఈ మూవీ కూడా కాలేజ్ బ్యాక్ గ్రౌండ్లోనే తెరకెక్కనుండటం విశేషం.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైందని తాజాగా ‘సార్’ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ‘సార్’ మూవీపై దర్శక నిర్మాతలు అభిమానుల్లో ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సీతార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగుతోపాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం.