Producer Anji Reddy: డబ్బు… డబ్బు.. డబ్బు.. ఇప్పుడు లోకమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. మనం తయారు చేసిన కడక్ కరెన్సీ నోట్లే.. మన కంట్రోల్లో ఉండాలనిన కాగితాలే.. మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. దీంతో డబ్బు కోసం కొంతమంది దేనికైనా తెగిస్తున్నారు. తాజాగా రూ.కోట్ల విలువైన ఆస్తిని చౌకగా కొట్టేసేందుకు పథకం వేశారు. ఆది బెడిసికొట్టడంతో హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ పద్మారావునగర్లో జరిగిది.
వీడిన సినీ నిర్మాత మర్డర్ మిస్టరీ… మిస్టరీగా మారిన సినీ నిర్మాత అంజిరెడ్డి(71) హత్య కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. సి. అంజిరెడ్డి గతంలో దొంగ అల్లుడు, చెలికాడు తదితర సినిమాలు నిర్మించారు. అంజిరెడ్డికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు మోకిలాలో ఉంటున్నారు. మరో కుమారుడు, కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. అంజిరెడ్డి దంపతులు. కూడా అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
ఇల్లు అమ్మేందుకు…
ఈ క్రమంలో పద్మారావునగర్లోని ఇంటిని విక్రయించాలని తన పరిచయస్థులతో చర్చించారు. సినీరంగంలో పరిచయం ఉన్న
ఫొటోగ్రాఫర్ డి.రవి రెజిమెంటల్బజార్లోని డీమార్ట్ భవనం పైభాగంలో ఉన్న జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేషు అంజిరెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. ఇంటిని చూసిన రాజేశ్ దాన్ని సొంతం చేసుకుని, వ్యాపార సముదాయం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే… స్థిరాస్తి వ్యాపారులకు ఇంటిని విక్రయించే ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇచ్చాడు.
మేడ్చల్ ఎందుకెళ్లినట్టు?
రాజేశ్ సూచనమేరకు సెప్టెంబరు 29న అంజిరెడ్డి తన కారులో అంజిరెడ్డి రెజిమెంటల్ బజార్లోని జీఆర్ కన్వెన్షన్ కు వెళ్లాడు. అక్కడ్నుంచి రాజేశ్, అంజిరెడ్డి, మరో ముగ్గురు కలసి మేడ్చల్ వైపు. వెళ్లినట్లు సమాచారం. అంజిరెడ్డితో పత్రాలపై సంతకం చేయాలని
వెళ్లినట్లు సమాచారం. అంజిరెడ్డితో పత్రాలపై సంతకం చేయాలని బలవంతం చేశారు. అంగీకించకపోవడంతో భౌతికదాడి చేశారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో అంతా కలిసి తిరిగి జీఆర్ కన్వెన్షన్ వద్దకు చేరారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అక్కడ జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులు అంజిరెడ్డిపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది.
సెల్లార్ లో ప్రమాదంగా..
అనంతరం మృతదేహాన్ని డీమార్ట్ భవనంలోని సెల్లార్ కు తీసుకెళ్లాడు. ఆయన కారును సెల్లార్లోని పిల్లర్ ను ఢీకొట్టారు. కారు తీస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించారు. అదేరోజు రాత్రి 9.15 గంటలకు అంజిరెడ్డి కుమారుడు చరణ్ రెడ్డికి డి. రవి ఫోన్ చేశాడు. డీమార్ట్ బేస్మెంట్ పార్కింగ్-3లో జరిగిన ప్రమాదంలో అంజిరెడ్డి మరణించారని సమాచారమిచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న చరణ్ రెడ్డి తండ్రి మృతిపై అనుమానం ఉందని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..
సెప్టెంబరు 30న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా సేకరించిన ఆధారాలతో అంజిరెడ్డి హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడు రాజేశ్, మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అంజిరెడ్డి ఆస్తిని చౌకగా కొట్టేయాలనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. హత్యకు సహకరించిన ఇద్దరు బిహారీయులు రాజేష్ వద్ద పనిచేస్తున్నారని, ఎటువంటి సుపారీ తీసుకోలేదని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.