Ketika Sharma : సినీ ఇండస్ట్రీ లో కేవలం ఒకే ఒక్క హిట్ చాలు, ఒక హీరో లేదా హీరోయిన్ తల రాత మార్చడానికి. ఏ హీరో/ హీరోయిన్ కి అయినా హిట్స్ ఉన్నన్ని రోజులే విలువ. హిట్స్ లేకపోతే కనీసం కన్నెత్తి కూడా చూడరు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ని సైతం పట్టించుకోరు, ఇక కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే వాళ్ళ సంగతి ఒక్కసారి ఊహించుకోండి?, కొంతమంది హీరోయిన్స్ అయితే బోలెడంత అందం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసిరాక సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ లేక, ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లో నిన్న మొన్నటి వరకు ఉన్నింది కేతిక శర్మ(Ketika Sharma). ఈమె 2021 వ సంవత్సరం లో పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా నటించిన రొమాంటిక్ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.
Also Read : అలాంటి డ్రామాలు ఆడడం నాకు రాదు అంటూ కేతిక శర్మ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’, ‘విజయ్ 69’ వంటి చిత్రాలు చేసింది. ఇవన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రంలో ‘అది దా సర్ప్రైజ్’ పాటతో యువత ని ఉర్రూతలూ ఊగించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వచ్చిన ఆమెకు రీసెంట్ గా శ్రీవిష్ణు(Sree Vishnu) తో కలిసి నటించిన ‘సింగిల్'(#Single Movie) చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో అద్భుతమైన రన్ ని సొంతం చేసుకుంటూ బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా నిల్చింది.
ఈ చిత్రం హిట్ అవ్వడంతో కేతిక శర్మ కి ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. త్వరలోనే మాస్ మహారాజ రవితేజ(Raviteja), కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ ఎంపిక అయ్యింది. సాధారణంగా ఈ సినిమాలో మమిత బైజు, కాయదు లోహర్ లు హీరోయిన్స్ గా నటిస్తారని నిన్న మొన్నటి వరకు ఒక టాక్ జరిగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం నగర్ లో విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఈమె మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు సంతకం చేసినట్టు తెలిసింది. వీటికి సంబంధించిన వివరాలు తెలియాలి. ఇక నుండి కేతిక శర్మ కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదేమో.
Also Read : ఒక పక్క బూతు స్టెప్స్ అంటూ శేఖర్ మాస్టర్ ని ఏకిపారేస్తుంటే… హీరోయిన్ కేతిక శర్మ ఏం చేసిందో చూడండి!