Kushboo Daughter: 90 స్ లో ఉన్న అగ్రతారాలలో ఆమె కూడా ఒకరు. కుష్బూ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కుష్బూ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ నటి పెద్ద కూతురు అవంతిక సామాజిక మాధ్యమాలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన అందం, అభినయంతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలిన అందాల తార కుష్బూ సుందర్. ఒకప్పుడు ఈమె మీద అభిమానంతో అభిమానులకు ఆమెకు ప్రత్యేక గుడి కట్టి కూడా ఆరాధించేవారు. అప్పట్లో ఈమె టాప్ హీరోయిన్ గా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బాగా రాణించింది. అనేక భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సినిమా ఇండస్ట్రీలో కుష్బూ తన వయసుకు తగిన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోవైపు రాజకీయాలలో కూడా కుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమె వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పాలి.
Also Read: ఒక్క హిట్ తో కేతిక శర్మ జాతకమే మారిపోయిందిగా..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్!
కెరియర్ ఫామ్ లో ఉన్న సమయంలోనే కుష్బూ నటుడు ప్రభును ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరి పెళ్లి సమయానికే ప్రభుకు పెళ్లి జరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక తర్వాత కుష్బూ తమిళ స్టార్ దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుష్బూ పెద్ద కూతురు అవంతిక సామాజిక మాధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం అవంతిక విదేశాలలో చదువుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అవంతిక సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ క్రేజీ ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
తన తల్లి కుష్బూ లాగానే అవంతిక కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అందంలో అవంతిక తన తల్లిని మించి ఉంటుంది. రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి అవంతిక ఎంట్రీ పై అధికారిక ప్రకటన కూడా వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమో కాదో వేచి చూడాలి. మరోవైపు కుష్బూ రెండో కూతురు అనంతిక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో కుష్బూ కుటుంబం నుంచి త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఉండబోతుంది అనే వార్తలు మాత్రం జోరందుకున్నాయి.
View this post on Instagram