https://oktelugu.com/

Keerthy Suresh : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో పెళ్లి గురించి కీర్తి సురేష్ సంచలన ప్రకటన..ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిరుద్

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 02:11 PM IST

    Keerthy Suresh's sensational announcement about marriage with music director Anirudh..this is not an ordinary twist!

    Follow us on

    Keerthy Suresh :  ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిరుద్. ఈయన సినిమాల్లోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి అనిరుద్ అందించిన మ్యూజిక్. అందుకే ఆయనకీ కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీస్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అనిరుద్ ని తమ సినిమా కోసం తీసుకుంటే సగం హిట్ అయ్యినట్టే అని అభిమానులు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. అయితే మ్యూజిక్ పరంగా ఇంత టాలెంట్ ఉన్న ఈయనకి, అమ్మాయిలను ప్రేమలో పడేయడంలో కూడా అంతే టాలెంట్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త. అనేకమంది హీరోయిన్స్ తో ఈయన ప్రేమాయణం నడిపి డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈయన ప్రముఖ స్టార్ హీరోయిన్ కీతి సురేష్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే గత రెండేళ్ల నుండి కీర్తి సురేష్, అనిరుద్ ప్రేమించుకుంటున్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారని, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకోబోతున్నారని ఒక ప్రచారం సాగింది, కారణం వీళ్లిద్దరు కలిసి ఇటీవల అనేక ప్రైవేట్ పార్టీలలో కనపడడమే. అయితే ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతో కీర్తి సురేష్ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ ప్రచారం ని చూసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. నేను అనిరుద్ తో ప్రేమలో లేను, అతినికి నాకు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్. నాకు అనిరుద్ మంచి స్నేహితుడు, అది మాత్రం ఒప్పుకుంటాను. ప్రస్తుతం నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. నా ద్రుష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. దీంతో సోషల్ మీడియా లో ఇన్ని రోజులు ప్రచారమైన రూమర్స్ కి చెక్ పడింది.

    ఇదంతా పక్కన పెడితే కీర్తి సురేష్ పై ఇలాంటి రూమర్స్ రావడం ఇది కొత్తేమి కాదు. గతంలో ఈమె ప్రముఖ తమిళ హీరో విజయ్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. రీసెంట్ గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ని ఆయన ప్రత్యర్థులు ఈ అంశం పై ట్రోలింగ్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి చిత్రానికి ఇది రీమేక్.